telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రెమ్యునరేషన్ పెంచేసిన మెగా హీరో… ఎంత అంటే ?

Varun-Tej

మెగా హీరో వరుణ్ తేజ్ ఈ ఏడాది “ఎఫ్-2”, “గద్దలకొండ గణేష్” చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు వరుణ్ మరో వినూత్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రాబోయే కొత్త చిత్రంలో వరుణ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి రూపొందించనున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. అల్లు వెంకటేష్, ముద్దా సిద్దు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అయితే సినిమా సినిమాకు వరుణ్ తేజ్ రేంజ్ పెరుగుతుందని చెప్పొచ్చు. వరుస విజయాలు వరుణ్ తేజ్ డిమాండ్ పెరిగేలా చేసింది. దర్శక నిర్మాతలు వరుణ్ తేజ్ తో సినిమా కోసం క్యూలు కడుతున్నారు. అందుకే ఇదే కరెక్ట్ టైం అని వరుణ్ తేజ్ కూడా తన రెమ్యునరేషన్ పెంచినట్టు టాక్. మొన్నటివరకు సినిమాకు 4 నుండి 5 కోట్ల వరకు తీసుకునే వరుణ్ తేజ్ రెండు బ్యాక్ టూ బ్యాక్ హిట్లు పడే సరికి ప్రస్తుతం సినిమాకు 8 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. వరుణ్ తేజ్ తో సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్నట్టుగా ఉంది. అందుకే నిర్మాతలు సైతం వరుణ్ అడిగిన రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సరే అంటున్నారట. ఎలా లేదన్నా వరుణ్ తేజ్ సినిమా 20 కోట్లలో పూర్తి చేసి టేబుల్ ప్రాఫిట్ గా 25 నుండి 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చెయ్యొచ్చు. సినిమా హిట్టైతే ఆ మొత్తం రాబట్టడం పెద్ద కష్టమేమి కాదు. ప్రస్తుతం మెగా హీరోల్లో చిరంజీవి, రాం చరణ్, అల్లు అర్జున్ తర్వాత మంచి ఫాంలో ఉన్న హీరో ఎవరంటే వరుణ్ తేజ్ అని చెప్పొచ్చు.

Related posts