telugu navyamedia
సినిమా వార్తలు

“సైరా”కు పవన్ వాయిస్ ఓవర్ పై ట్రోలింగ్

Syeraa

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, రవికిషన్, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా టీజర్‌ను చిరంజీవి పుట్టినరోజు (ఆగస్ట్ 22) సందర్భంగా రెండు రోజుల ముందుగానే ఆగస్ట్ 20న విడుదల చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా “సైరా” టీజర్ ట్రెండ్ అవుతుంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు అమిత్‌ త్రివేది.

టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు చిరు లుక్ కి కూడా మంచి ఫీడ్ బ్యాక్ వస్తోంది. అయితే సినిమా తెలుగు టీజర్ కి పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ వాడడం అభిమానులకు రుచించడం లేదు. నిజానికి పవన్ కళ్యాణ్ వాయిస్ లో గంభీరం ఉండదు. టీజర్ లో డైలాగులను మరింత నీరసంగా చెప్పడంతో మెగాభిమానులకు నచ్చలేదు. ఎమోషనల్ గా పవర్ ఫుల్ గా చెప్పాల్సిన డైలాగ్స్ ని పవన్ మాములుగా పలికేశారని విమర్శిస్తున్నారు. ఈ టీజర్ లో వినిపించిన మాటలే కాకుండా సినిమాలో వాయిస్ ఓవర్ పార్ట్ కూడా చాలా ఉందని… అదంతా పవన్ కళ్యాణ్ చెబుతున్నాడని చెప్పుకుంటున్నారు. ఈ విషయం కూడా మెగాభిమానులను కలవరపెడుతోంది. కొందరు పవన్ వాయిస్ సినిమాకి ప్లస్ అవుతుందంటే మరికొందరు మాత్రం వాయిస్ ఓవర్ విషయంలో పెదవి విరుస్తున్నారు. మరి సినిమాపై పవన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Related posts