వార్తలు వ్యాపార

నగదు కొరత తీరుస్తాం : బాబు

రాష్ట్రంలో నగదు కొరతపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు బ్యాంకర్లతో విజయవాడలోని ప్రజాదర్భార్ హాల్ లో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నగదు నిల్వలపై ఈ సమావేశంలో వాడి వేడి చర్చ జరిగింది.

డిజిటలైజేషన్ మనీ ట్రాన్స్ యాక్షన్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో, అవి ఎండతావరకు విజయవంతమయ్యాయని ఆర్బీఐ అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. ప్రతి ఏటా నగదు కొరత ఎందుకు వస్తుందని ఈ సందర్బంగా ఆయన ప్రశ్నించారు. వ్యవసాయ పెట్టుబడులపై చర్చిస్తున్నామని చంద్రబాబు అన్నారు.

రాష్ట్రంలో నగదు కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ ఎందుకు ఈ సమస్యను అధిగమించలేకపోతున్నారని ఆర్బీఐ అధికారులను, కేంద్ర ప్రభుత్వ అధికారులను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, కుటుంబరావు లు ప్రశ్నించారు. దీనికి బదులిచ్చిన అధికారులు నగదు లభ్యతలో ఇబ్బందులు లేవన్నారు. ఈ వాదంతో విభేదించారు ఆర్బీఐ అధికారులు. తెలుగు రాష్ట్రాలకు ఎక్కువ డబ్బులు పంపుతున్నామన్నారు ఆర్బీఐ అధికారులు.

నగదును దేశంలోనే అతి ఎక్కువగా హైదరాబాద్ ఆర్బీఐ కి పంపామన్నారు అధికారులు. దీంతో ఏపీ కి ఎంత పంపారో విడిగా చెప్పాలని కుటుంబరావు ప్రశ్నించారు. రెండు వేళా నోట్లు కనిపించకుండా పోయాయని, 200 వందల నోట్లు బ్యాంకుల్లో మాత్రమే కనిపిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. నగదు కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని యనమల రామకృష్ణుడు తెలిపారు.

నగదు కొరతతో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయిందని ఆయన అన్నారు. వంద నోట్లు కూడా ఎక్కడ కనిపించడం లేదని ఈ సందర్బంగా ఆయన అన్నారు. వృద్ధి రేటు 2 శాతం తగ్గిందని, నిర్మాణాలు చాల తగ్గిపోయాయని ఆయన అన్నారు. మనీ సర్క్యూలేష లేకుంటే భవిష్యత్తులో చాల ఇబ్బందులు ఎదురుకోవలసివస్తుందని ఆయన అన్నారు.

Related posts

క్యాస్టింగ్ కౌచ్ పై రేపు ప్రభుత్వ ఉన్నతస్థాయి సమావేశం

admin

బీజేపీ హయంలోనే వారిపై దాడులు

admin

మార్కెటింగ్‌ ఏజెంట్‌గా కేసీఆర్‌

madhu

Leave a Comment