telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఏ సర్టిఫికెట్ చూపిస్తా… అంటున్న రకుల్ : మన్మథుడు-2

Manmathudu

మ‌న్మ‌థుడు చిత్రానికి సీక్వెల్ గా నాగార్జున హీరోగా ప్ర‌స్తుతం చిల‌సౌ ఫేం రాహుల్ ర‌వీంద్ర ద‌ర్శ‌క‌త్వంలో “మ‌న్మ‌థుడు-2” చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ర‌కుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ చిత్రంలో. రావు రమేశ్‌, లక్ష్మి, ఝాన్సీ, వెన్నెల కిశోర్‌, దేవదర్శిణి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌య్‌కామ్ 18 స్టూడియోస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నాగార్జున స్వయంగా జెమిని కిర‌ణ్‌‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఆర్‌ఎక్స్ 100 ఫేం చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడుగా ప‌ని చేస్తున్నారు. ఆగ‌స్ట్ 9న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. టీజ‌ర్లోని లిప్‌లాక్ స‌న్నివేశాల‌ను వ‌ల్ల‌ నాగ్ విమ‌ర్శ‌ల‌ను సైతం ఎదుర్కొన్నారు. తాజాగా ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ కు సంబంధించిన టీజర్ ను “మీట్ అవంతిక” అంటూ విడుదల చేశారు. ఈ టీజర్లో “అవంతిక పేరు ఎంత విన‌సొంపుగా ఉంది.. అంతే ప‌ద్ధ‌తి గ‌ల అమ్మాయి” అని ల‌క్ష్మి చెప్పే డైలాగ్‌తో పాటు సంప్ర‌దాయబ‌ద్ధమైన లుక్‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌నిపించింది. అలాగే హాట్ లుక్‌లోనూ క‌న‌ప‌డింది. “ఇప్ప‌టి వ‌ర‌కు యు సర్టిఫికెట్ ట్రై చేశాను. ఇక‌పై ఏ స‌ర్టిఫికెట్ చూపిస్తా…” అంటూ ర‌కుల్ నాగ్‌తో చెప్పే డైలాగ్‌తో పాటు ర‌కుల్ సిగ‌రెట్ తాగి పొగ వ‌దిలే సీన్‌లో క‌న‌ప‌డింది. ఈ సీనే ఈ ప్రోమోలో హైలైట్‌గా నిలుస్తుంది. “ఈమెను మీరు ప్రేమిస్తారు లేదా ద్వేషిస్తారు” అనే లైన్‌తో ర‌కుల్ చేసిన అవంతిక పాత్ర‌ను తెలియ‌జేసింది చిత్ర యూనిట్‌. నాగార్జున అక్కినేని హీరోగా న‌టించిన “మ‌న్మ‌థుడు-2” ఆగ‌స్ట్ 9న విడుద‌ల‌వుతుంది. మీకు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.

Related posts