telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నెపోటిజం అంటూ సూర్య, విజయ్ పై మీరా మిథున్ తీవ్ర వ్యాఖ్యలు…!

Meera

తమిళ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ మీరా మిథున్ కోలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖులపై వ్యాఖ్యలు చేస్తూ సంచలనం సృష్టిస్తోంది. తాజాగా కోలీవుడ్ స్టార్లు సూర్య, విజయ్ లపై మీరా తీవ్ర వ్యాఖ్యలతో విమర్శలు గుప్పించింది. కోలీవుడ్ లో నెపోటిజం వల్లే వీరిద్దరూ తెరపైకి రాగలిగారని, ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారని, సొంత ఫ్యాన్స్ ను కంట్రోల్ చేసే శక్తి కూడా వీరికి లేదని, చేతికి గాజులు తొడుక్కుని కూర్చుంటారని మండిపడింది. మీరా వ్యాఖ్యలను సినీ ప్రముఖులు సైతం తప్పుపడుతున్నారు. ఈ సందర్భంగా సూర్య స్పందిస్తూ… తక్కువ స్థాయి వ్యక్తులు చేసే విమర్శలపై స్పందిస్తూ సమయాన్ని వృథా చేసుకోవద్దని చెప్పాడు. విలువైన ఆ సమయాన్ని సమాజం కోసం వినియోగించాలని సూచించాడు. తనకు మద్దతు తెలిపిన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పాడు. కాగా ఇప్పటికే త్రిషపై ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది. త్రిషకు కులపిచ్చి ఎక్కువని మండిపడింది. ఇండస్ట్రీలో తనను తొక్కేయడానికి ప్రయత్నించిందని చెప్పింది.

Related posts