telugu navyamedia
telugu cinema news trending

“మీకు మాత్రమే చెప్తా” టీజర్ వచ్చేసింది…!

MMC

కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నిర్మిస్తోన్న చిత్రం “మీకు మాత్రమే చెప్తా”. ఎవ్రీ ఫోన్ హ్యాజ్ ఇట్స్ సీక్రెట్స్ అనేది ట్యాగ్ లైన్. తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ మూవీలో అనసూయ భరద్వాజ్, వాణి భోజన్, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. టైటిల్‌కు తగ్గట్టుగానే ఈ మూవీ ఫన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని టీజర్ చూస్తేనే తెలుస్తుంది. “మీకు మాత్రమే చెప్తా” అనే క్యాచీ టైటిల్‌తో వస్తోన్న ఈ మూవీ టీజర్‌తోనే ప్రామిసింగ్ మూవీ అనిపించుకుంటోంది. చిన్న పాయింట్ చుట్టూ అల్లుకున్న మంచి ఎంటర్‌టైనర్‌లా కనిపిస్తోంది. ఇక థియేటర్‌లో పూర్తిగా నవ్వులు పంచేందుకు మూవీ టీమ్ రెడీ అవుతోంది. షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ దశలో ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని అక్టోబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.

Related posts

డ్రీమ్ గ‌ర్ల్‌ : రాధే రాధే వీడియో సాంగ్

vimala p

సాయి ధరమ్ తేజ్ కొత్త చిత్రం టైటిల్ ఇదే…?

vimala p

చిరంజీవి ఇండస్ట్రీని శాసిస్తున్నారనడం చాలా తప్పు : నాగబాబు

vimala p