telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“మీకు మాత్రమే చెప్తా” మా వ్యూ

MMC

బ్యాన‌ర్‌ : కింగ్ ఆఫ్ ది హిల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
న‌టీన‌టులు : తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, అనసూయ భరద్వాజ్, వాణి భోజన్ త‌దిత‌రులు
రచన-దర్శకత్వం: స‌మీర్ సుల్తాన్
సంగీతం: శివ‌కుమార్‌
సినిమాటోగ్ర‌ఫీ: మ‌ద‌న్ గుణ‌దేవా
నిర్మాతలు : విజయ్ దేవరకొండ, వర్ధన్ దేవరకొండ.

‘పెళ్ళిచూపులు’ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయమయ్యాడు తరుణ్ భాస్కర్. ఈ చిత్రంతో సక్సెస్ తో పాటు, రైట‌ర్‌గా నేష‌న‌ల్ అవార్డ్‌ని కూడా అందుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ యంగ్ డైరెక్టర్ హీరోగా మారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. విజయ్ దేవరకొండ నిర్మాణంలో తెరకెక్కిన “మీకు మాత్రమే చెప్తా” అనే కామెడీ మూవీతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు తరుణ్ భాస్కర్. మరి ఈ దర్శకుడు హీరోగా ప్రేక్షకులను మెప్పించాడా ? లేదా ? అనేది తెలుసుకుందాం.

కథ :
ఓ టివి ఛానెల్లో యాంకర్ గా పని చేస్తుంటాడు రాకేష్ (తరుణ్ భాస్కర్). అతను ఒక డాక్టర్ ను ప్రేమిస్తుంటాడు. ఆ అమ్మాయికి సిగరెట్స్, మందు, అమ్మాయిలు అంటూ తిరిగే అబ్బాయిలు అసలు ఇష్టం ఉండదు. దీంతో తన భర్త కూడా వీటన్నింటికీ దూరంగా ఉండాలని కోరుకుంటుంది. ఈ క్రమంలో ఆమెతో రాకేష్ కు పెళ్లి ఫిక్స్ అవుతుంది. పెళ్ళి మరో రెండ్రోజులు ఉందనగా అకస్మాత్తుగా రాకేష్ కు సంబంధించిన ఓ వీడియో బయటకు వస్తుంది. ఆ వీడియో తన గర్ల్ ఫ్రెండ్ చూస్తే ఎక్కడ పెళ్ళి ఆగిపోతుందో అని భయపడుతాడు రాకేష్. అందుకే ఆమె చూడకముందే ఈ వీడియోను డిలీట్ చేయాలనుకుంటాడు. ఈ నేపథ్యంలో తన ఫ్రెండ్ కామేష్ (అభినవ్ గోమటం) తో కలిసి హ్యాకర్ కోసం వేట పారంభిస్తాడు. అసలు ఆ వీడియోలో ఏముంది ? హ్యాకర్ ను పట్టుకుని ఆ వీడియో లింక్ ను తొలగించరా ? ఈ క్రమంలో రాకేష్ ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు ? చివరికి రాకేష్ పెళ్ళి జరిగిందా ? లేదా ? అనే విషయాలు తెలియాలంటే సినిమాను వెండి తెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
తరుణ్ భాస్కర్ “పెళ్ళి చూపులు” సినిమాతో దర్శకుడిగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇప్పుడు హీరోగా కూడా మంచి మార్కులు కొట్టేశాడు. సినిమాలో తన పాత్రకు తగ్గట్లుగా నటించి కామెడీని పండించారు. హీరోయిన్ వాణి భోజన్ ఫర్వాలేదన్పించింది. ఇక అభిన‌వ్ గోమ‌టం న‌ట‌న సినిమాకు ప్ల‌స్ అయ్యింది. త‌న‌దైన న‌ట‌తో అభినవ్ ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించాడు. ఇక అన‌సూయ భ‌రద్వాజ్ కీలకపాత్రలో నటించింది. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు :
ష‌మీర్ సుల్తాన్ కొత్త దర్శకుడే అయినా సినిమాను చక్కగా తెరకెక్కించారు. మన ఫోన్ లో ఉన్న ఓ సీక్రెట్ వీడియో లీకైతే ఆ టెన్షన్ ఎలా ఉంటుందనే విషయాన్ని వెండితెరపై ఆకట్టుకునేలా తెరకెక్కించారు. అయితే సినిమా ద్వితీయార్థం మొత్తం సాగదీసినట్టుగా అన్పిస్తుంది. పెద్దగా ట్విస్టులేమీ ఉండవు. మ‌ద‌న్ గుణ‌దేవా కెమెరా వ‌ర్క్‌, శివ‌కుమార్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఒక దర్శకుడిని హీరోగా పెట్టి సినిమా చేయడానికి నిర్మాతగా ముందుకొచ్చిన విజయ్ దేవరకొండ ధైర్యాన్ని మెచ్చుకోవలసిందే.

రేటింగ్ : 2.5/5

Related posts