telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ వ్యాపార వార్తలు

ఔషధ స్కాం..! 100 ఖరీదు ఉంటే, 3వేలకు అమ్మకం.. !!

medicines scam selling with wrong mrp

నిజామాబాద్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వ్యవస్థాపక అధ్యక్షుడు పీఆర్ సోమాని ఔషధ తయారీ కంపెనీలు అసలు ధరకు దాదాపు 30 రెట్ల వరకు పెంచి ఎమ్మార్పీ ముద్రిస్తున్నాయని ఆరోపించారు. దేశప్రజలంతా ఆర్థికంగా దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇందులో కంపెనీలతోపాటు పలువురు డిస్ట్రిబ్యూటర్లు, రిటైల్ వ్యాపారులు, డాక్టర్లు భాగస్వాములుగా ఉన్నారన్నారు. ఔషధాల అమ్మకాల్లో అవినీతికి సంబంధించి కొన్ని ఆధారాలను ఆయన మంగళవారం హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో మీడియాకు బహిర్గతం చేశారు.

దేశంలో మందుల ధరలను అదుపులో ఉంచేందుకు సరైన డ్రగ్ పాలసీ లేకపోవడంతో తయారీదారులు రెచ్చిపోతున్నారని చెప్పారు. శస్త్రచికిత్సల ఉపకరణాలపైనా అధిక మొత్తంలో ధరలు ముద్రిస్తూ దోచుకుంటున్నారని వెల్లడించారు. ఉదాహరణకు.. ఒక కంపెనీ ఔషధం తయారుచేసిన తర్వాత రిటైలర్ ద్వారా రూ.100కు అమ్మాల్సి ఉంటుంది. కానీ ఎమ్మార్పీ రూ.మూడువేలుగా ప్రింట్‌చేసి అమ్ముతున్నారు. తయారీఖర్చు కంటే 30 రెట్లు అధిక ధర వసూలు చేస్తున్నారు అని వివరించారు.

డ్రగ్స్ ప్రైసెస్ కంట్రోల్ యాక్ట్-2013 ప్రకారం నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) షెడ్యూల్‌లో పేర్కొన్న మందుల ధరలను నియంత్రింస్తుందని సోమాని తెలిపారు. వీటిపై రిటైలర్ 16 శాతం మాత్రమే మార్జిన్ తీసుకోవాలన్నారు. షెడ్యూల్‌లో లేని మందులపై ఎలాంటి నియంత్రణ లేదని, ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న 80-85 శాతం మందు లు ఇలాంటివేనని చెప్పారు. అధిక ధరలపై తాను 2018 అక్టోబర్‌లో ప్రధాని మోదీకి ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశానని, డిసెంబర్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దృష్టి కి తీసుకెళ్లానని సోమాని చెప్పారు.

కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రులు, ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేశానన్నారు. ఎట్టకేలకు స్పందించి మందుల ధరలను తగ్గించేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించిందన్నారు. 42 యాం టీ క్యాన్సర్ మందుల ధరలను నియంత్రించిదని చెప్పారు. మందు ల తయారీ ధరలకు గరిష్ఠంగా 30 శాతం లాభాలు వసూలుచేసేలా చర్యలు తీసుకున్నదన్నారు. ఫలితంగా వాటి ధరలు 85% వరకు తగ్గినట్టు చెప్పారు. ఈ ధరలు ఈ నెల 8వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయన్నారు. ఈ విజయంలో తన పాత్ర ఉండటం సంతోషం కలిగించిందన్నారు.

ఎన్పీపీఏ ప్రకారం ఒక రిటైలర్ 16 శాతం లాభంతో మందులు అమ్మాల్సి ఉంటుంది. కానీ.. కొన్ని మెడికల్ షాపుల్లో మందులపై 10-20 శాతం డిస్కౌంట్ ఇస్తుంటారు. అప్పటికే ఎమ్మార్పీ అధిక మొత్తంలో ముద్రించి ఉండటం వల్లే ఇవ్వగలుగుతున్నారు అని సోమాని పేర్కొన్నారు. మందులు అత్యవసరం కాబట్టి.. ప్రజలు వాటి ధర విషయంలో పెద్దగా ఆలోచించరన్నారు. వెంటనే చట్టంలో మార్పులు చేసి మందుల ధరలు 35శాతానికి మించకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.

తగ్గనున్న మందుల ధరల్లో కొన్ని.. (రూ.ల్లో) :
ఔషధం కంపెనీ : పాత ధర – కొత్త ధర
బోర్టెజోమిల్3.5ఎంజీ నాట్కో : 13,900 – 4,799
పాక్లిటాక్సెల్ 100 ఎంజీ ఫ్రెసేనియస్ : 3,702 – 800
డోక్సోరుబిసిన్ హైడ్రోక్లోరైడ్-ఫ్రెసేనియస్ : 912 – 480

Related posts