telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

దేశీయంగా … హెచ్‌ఐవీ-1ను నియంత్రించే .. ఔషధం ..: హెటిరో హెల్త్‌కేర్‌

medicine for hiv1 in india by hetiro

హెటిరో హెల్త్‌కేర్‌ సంస్థ దేశీయ మార్కెట్లోకి హెచ్‌ఐవీ-1ను నియంత్రించే ఔషధాన్ని విడుదల చేసింది. 3-ఇన్‌-వన్‌ కలిగిన ఈ మందును టాఫిక్‌ బ్రాండ్‌తో ప్రవేశ పెట్టింది. గిలేడ్‌ బిక్తార్వేకు జనరిక్‌ వెర్షన్‌గా ప్రవేశపెట్టిన ఈ ఉత్పత్తికి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి కూడా ఇచ్చింది. దేశీయ రిటైల్‌ మార్కెట్లో హెటిరో హెల్త్‌కేర్‌ విక్రయించడంతోపాటు డిస్ట్రిబ్యూట్‌ చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులకు దీన్ని అందించనుంది.

హెచ్ఐవీ-1 వ్యాధి సోకిన వారు ఈ మాత్రలతో నయం చేసుకోవచ్చు. హెచ్ ఐవీ ప్రాణాంతక వ్యాధి అని అందరికీ తెలిసిన విషయమే. హెచ్ఐవీ-1 వ్యాధి నియంత్రించేందుకు మందు రావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మందు రావడంతో హెచ్ ఐవీ 1 వ్యాధి సోకిన వారికి ఊరట కలిగింది. హెచ్ ఐవీ సోకిన ఎంతో మందిని కాపాడవచ్చని అంటున్నారు.

Related posts