telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

జాతరకు ముందే మేడారంకు భక్తుల తాకిడి

medaram jatara

మేడారం మహా జాతరకు ముందే సమ్మక్క, సారక్కల మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. ఆదివారం ఒక్కరోజే ములుగు జిల్లా మేడారానికి 3లక్షలమంది భక్తులు వచ్చినట్లు తెలుస్తోంది. తల్లులకు తలనీలాలు సమర్పించి.. జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులు, క్యూ లైన్లలో నిల్చుని వనదేవతలను దర్శించుకుంటున్నారు. తల్లులకు కానుకగా నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు.

భక్తులు సమర్పించిన కానుకలతో వనదేవతల గద్దెలు నిండిపోయాయి. సంక్రాంతి సెలవులు కావడంతో తెలంగాణ నుంచే కాకుండా ఏపీ నుంచి కూడా భక్తుల పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆదివారం జంపన్నవాగు పరిసరాల్లో ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది. భక్తుల రాకను ఊహించని పోలీసులు అప్రమత్తమై అధనపు సిబ్బందిని రప్పించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. భక్తులు వెల్లువలా తరలిరావడంతో క్యూలైన్ల ద్వారా దర్శనానికి అనుమతించారు.

Related posts