telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

బతుకమ్మ.. పేరు వెనుక అర్ధం తెలుసా…

meaning behind names of gram devata

దేవుళ్లు ఎందరున్నా గ్రామదేవతలను పల్లెల్లో విశేషంగా కొలుస్తారు. పోలేరమ్మ, ఎల్లమ్మ, పుట్టమ్మ, అచ్చమ్మ, తలపులమ్మతల్లి.. ఇలా ఎన్నో రూపాల్లో కొలుచుకుంటారు. అసలు ఈ గ్రామదేవతలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసుకుందాం.. మనం రకరకాల పేర్లతో పిలిచే ప్రతి గ్రామదేవత పేరు వెనుక ఒక పరమార్ధం ఉంది. వూరిని విడిచి పొరుగూరు వెళ్ళే వ్యక్తుల రాకపోకల్ని గమనిస్తూ వూరి పొలిమేరలో వుండే తల్లి పొలిమేరమ్మ క్రమముగా పోలేరమ్మ అయింది. ‘ఎల్ల’ అంటే సరిహద్దు అని అర్దము అందుకే ‘ఎల్లమ్మ’ కూడా ఈ పనిని చేసేదన్నమాట. ఒక వ్యక్తికి జీవన భృతి కలిగించి పోషించే తల్లి ‘పోచ+అమ్మ=పోచమ్మ’ అన్నమాట. ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు రాకుండా నివారించేదైతే, పోచమ్మ పోషణ కలిగిస్తుంది. ప్రతి వ్యక్తికీ ఇంతకాలము జీవించాలనే ఓ కట్ట (అవధి) ఏదుందో ఆ కట్టని మేయగల (ఆ అవధినించి రక్షించగల) అమ్మే ‘కట్టమేయ+అమ్మ=కట్టమేసెయమ్మ కాలక్రమములో కట్టమైసమ్మ అయింది. స్వచ్ఛమైన అమ్మ అనే అర్దములో అచ్చ (స్వచ్ఛమని)సు+అచ్చ=స్వచ్ఛ అనే రెండు పదాలు కలిపి అచ్చమ్మగా అయ్యింది. సాధారణముగా 15 వూళ్ళకో దేవత వుంటుంది. ‘మా వూళ్ళన్నింటికీ అమ్మ’ అనే అర్దములో ఆమెను మావూళ్ళమ్మ అని పిలుస్తూంటే క్రమముగా అది మావుళ్ళమ్మ’ అయింది.

ప్రజల మనసులో పుట్టి ఏ కోర్కెనైనా మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోర్కెని తీర్చే బాధ్యతని స్వీకరంచి భక్తులకు అండగా నిలిచే తల్లి తలుపులమ్మ. తలపు అంటే ఆలోచన వాటిని తీర్చే తల్లి తలపులమ్మ క్రమముగా ఈమె ‘తలుపులమ్మ’గా మారింది. ఇంట్లో నుండి బయటికి వెల్లేటపుడు తల్లికి లేదా భార్యకి ఎలా చెప్తామో అలాగే ఆ తల్లిని ప్రార్థించి వెళ్ళడం చేస్తారు. శంకరునితో కలసి అర్దనారీశ్వర రూపముతో అమ్మవారుండేది. ఆకారణముగా శంకరుని మెడమీద (గళము) మచ్చ (అంకం) కారణముగా అంకగళమ్మ, కాలక్రమేణా అంకాళమ్మ గా మారిపోయింది. బతుకుకి కావలసిన వర్షాన్ని పంటనీ ఇచ్చే తల్లి బతుకమ్మ. గ్రామప్రజల మంచిని చూసే (కనే) అమ్మ కన్నమ్మగా ఎప్పుడూ సత్యాన్ని (నిదర్శనాలని) చూస్తూవుండే తల్లి సత్య+అమ్మ= సత్తెమ్మ. అలాగే పుల్ల (వికసించిన కళ్ళున్న)అమ్మ పుల్లమ్మ. ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి చూస్తుంది కాబట్టి ఆమె పుల్లమ్మ అయ్యింది. ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకొనే చోటవున్న తల్లి అర్పణ+అమ్మ = అర్పణలమ్మ క్రమముగా అప్పలమ్మ అయినది.

Related posts