Trending Today వార్తలు సినిమా వార్తలు

మీటూ ఉద్యమం కేవలం మహిళలకు ఒక్కరికే కాదు..!

Thanusri Dutta Comments about Amitab Bachchan Im Hurt

తెలుగు చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ వివాదం ఎంత దుమారం లేచిందంటే ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ లో కొందరికి ముచ్చెమటలు పట్టించింది… అదే రీతిలో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో మీ టూ ఉద్యమం చెలరేగిపోతుంది… అసలు మీటూ ఉద్యమం ఇందుకోసం అని పరిశీలిస్తే మహిళలకోసమే అని సమాధానం వస్తుంది… మహిళలు తమపై జరిగే లైంగిక వేధింపులు కానీ లైంగిక దాడులు కానీ చేసిన వారి బండారం బయటపెట్టి అటువంటి వారికి చట్టపరమైన శిక్షలు పడేలా చూడటం తమకు రక్షణ కల్పించాలని బాధిత మహిళలు కోరుకోవడం ముఖ్య లక్ష్యాలు పెట్టుకొని ముందుకు సాగిపోతుంది..

ఇక బాలీవుడ్ లో తనుశ్రీ దత్తా.. విలక్షణ నటుడు నానా పాటేకర్ పై చేసిన సంచలనమైన ఆరోపణల తరువాతే ఈ ఉద్యమానికి ఊపందుకుందని చెప్పుకోవాలి… కాగా ఈ ఉద్యమం కేవలం మహిళల హక్కుల కోసం జరుగుతున్న ఉద్యమం కాదని… మగవారిని, పిల్లలను కూడా ఇందులో చేర్చాలని తనుశ్రీ దత్తా పేర్కొన్నారు…మనుషుల ఆలోచన విధానం మారాలి ఎందుకంటే తనను వేధింపులకు గురిచేసిన సమయంలో సుమారు 200 మంది ఆ సెట్ లోనే ఉండి ఉంటారు… ఆ సమయంలో వారెవరు నాకు రక్షణగా ముందుకు రాలేదు. అదెంత దారుణం.. అందుకే మనుషుల ఆలోచన విధానం మారాలి.. వీరు రేపు కోర్టుకు వచ్చి తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్తారని ఆశించలేమని…

కోర్టులో పోరు అంత సులభం కాదని… ప్రత్యర్థులు బెదిరింపులు, బురదజల్లడం వంటివాటికి పాల్పడుతూనే ఉంటారని, ఆకతాయి వేధింపుదారుగా, వేధింపుదారు రేపిస్టుగా మారుతాడని హెచ్చరించారు.. మొగ్గలోనే తుంచే ధోరణి సమాజానికి అలవడాలని తనుశ్రీ సూచించారు…

Related posts

ఎన్టీఆర్ నోట… పవన్ కళ్యాణ్ డైలాగ్…!!

nagaraj chanti

పర్యాటకులకు శుభవార్త… వారాంతాల్లో మరియు పండగలకు అందుబాటులో

chandra sekkhar

తెలుగులో నటించడం లేదు : రష్మిక..

admin

Leave a Comment