telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు మంచిదే: మాయావతి

Mayawati Welcomes Reservation To Upper Castes

అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం మంచిదని, బీఎస్పీ అధినేత్రి, ఉత్తర ప్రదేశ్‌ మాజీ సీఎం మాయావతి అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్లు మాయావతి తెలిపారు. వెనుకబడిన అగ్ర కులాల వారికి రిజర్వేషన్లు అయితే ఎన్నికల వేళ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాజకీయ గిమ్మిక్కుగా ఆమె వర్ణించారు.

కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తామని గతంలో ఆమె ఇచ్చిన హామీను గుర్తుచేశారు. కాగా లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అ‍గ్రవర్ణ కులాల ఓట్లకు గాలం వేసేందుకే రిజర్వేషన్ల అంశాన్ని మోదీ తెరపైకి తెచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Related posts