telugu navyamedia
రాజకీయ వార్తలు

ఆర్థిక మందగమనం భారత్ కు పెద్ద సమస్యగా మారనుంది: మాయావతి

mayawati

ఆర్థిక మందగమనం భారత్ కు పెద్ద సమస్యగా మారనుందని బీఎస్పీ అధినేత్రి మాయావతి చెప్పారు.పేదరికం, నిరుద్యోగం తదితర సమస్యలతో భారత్ ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలను తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితితో వ్యాపారులు తమ సిబ్బందిని తొలగిస్తున్నారని, మరికొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని చెప్పారు. సంక్షోభాన్ని నివారించేందుకు తగు చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో పెను సవాళ్లను ఎదుర్కోవాల్పి వస్తుందని ఆమె తెలిపారు.

Related posts