telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

అమెరికాపై మరో సరికొత్త దాడి జరగబోతుందా ?

USA

అమెరికా కరోనా వైరస్ తో ఇప్పటికే అతలాకుతలమైపోయింది. ఆర్ధికంగా చిన్నాభిన్నమైపోయింది. కరోనా కాటుతో 17 లక్షలమంది నరకం అనుభవిస్తున్నారు. ఇప్పటికే 99,459 మంది మంది చనిపోయారు. ఇలాంటి విపత్కర, భయానక వాతావరణంలో అమెరికాలో ప్రజలు బిక్కు బిక్కుమని బ్రతుకుతున్నారు. ఇలాటి పరిస్థితిలో అమెరికాపై మరో దాడి జరగబోతుందా ? అవునని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఏ దేశమైనా అమెరికా మీద అణుబాంబు ప్రయోగిస్తుందా ? లేదా జీవరసాయనంతో అమెరికాను అతలాకుతలం చేయబోతున్నారా ? అనే అనుమానాలు చాలా మందికి రావచ్చు. అయితే ఇది అలాంటి దాడి కాదు. అందరికీ ఆశ్చర్యం కలిగించే విధంగా కీచురాళ్ళు అమెరికాపై దాడి చెయ్యబోతున్నాయి. కీచురాళ్లేమిటి… అమెరికా మీద దాడి ఏమిటి… ? నమ్మశక్యంగా లేదు కదూ ! కానీ ఇది నిజమే. ఈ విషయాన్ని అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో కీటక శాస్త్రవేత్త ఎరిక్ డే ప్రకటించారు. ఈ విషయాన్ని సి.ఎన్.ఎన్ తెలిపింది.

USA
17 సంవత్సరాల తరువాత కీచురాళ్ళ దాడి జరగబోతుంది. అమెరికాలోని నైరుతి వైపు వున్న వర్జీనియా, ఉత్తర కరోలినా, పడమర వైపు వున్న వర్జీనియా ప్రాంతాలలో కీచురాళ్ళ దాడి జరుగుతుంది. ఇక్కడ భూమి నుంచి ఈ కీటకాలు ఉద్భవిస్తాయి. ఎకరం నేల నుంచి 15 లక్షల కీచురాళ్ళు ఉద్భవించే అవకాశం ఉందని శాస్త్రవేత్త ఎరిక్ డే తెలిపారు. ఈ సంవత్సరంలో ఈ పరిణామం చోటు చేసుకునే అవకాశం వుంది. లక్షలాది కీచురాళ్ళ ముక్తకంఠంతో చేసే ధ్వని… ఊహించడానికే భయంకరంగా ఉంటుంది. ఈ కీచురాళ్లవల్ల మనుషులకు ఎలాంటి హాని ఉండదని, అయితే ఇవి చేసే శబ్దం మాత్రం అది భయంకరంగా ఉంటుందని, వాటి శబ్దంతో చికాకు, కోపం వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. లక్షలాది కీచురాళ్ళ వింత, విచిత్ర ధ్వనులతో మనసుకు ప్రశాంతత లేకుండా ఉంటుందని, అయితే కొన్ని లక్షల కీచురాళ్ళు ఆకాశంలో ఎగురుతూ శబ్దం చేస్తుంటే… చూడటానికి మాత్రం అద్భుతంగా ఉందని ఎరిక్ తెలిపారు.

– విమలత

Related posts