telugu navyamedia
క్రీడలు వార్తలు

ఆసీస్ వెళ్ళడానికి ఆటగాళ్ల ప్లాన్ ఏంటో చెప్పిన మ్యాక్స్‌వెల్…

kohli on maxwell short leave to cricket

ఐపీఎల్ 2021 నుండి ఇప్పటికే ఐదు మంది ఆటగాళ్లు, ఇద్దరు అంపైర్లు ఐపీఎల్ 14వ సీజన్ నుంచి తప్పుకున్నారు. ఐదుగురు ఆటగాళ్లలో ముగ్గురు ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఉండడం గమనార్హం. ఆసీస్ ఆటగాళ్లు ఆండ్రూ టై, కేన్‌ రిచర్డ్‌సన్‌, ఆడమ్‌ జంపా.. ఇంగ్లండ్ ప్లేయర్ లియామ్ లివింగ్‌స్టోన్, టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ 2021 నుంచి తప్పుకున్నారు. భారత్‌ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లే అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ఆ దేశం ప్రకటించిన నేపథ్యంలో.. కంగారో ఆటగాళ్లు టోర్నీ నుంచి నిష్క్రమిస్తున్నారు. ఐపీఎల్‌ 2021లో ఆడుతున్న మిగతా ఆస్ట్రేలియా ప్లేయ‌ర్స్ టోర్నీ ముగిసిన త‌ర్వాత‌ ఇంటికెళ్లాలా అన్న ఆలోచ‌న‌లో ప‌డ్డారు. అయితే రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స్టార్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇందుకు ఓ పరిష్కారం చూపించాడు. ఐపీఎల్ టోర్నీ ముగియ‌గానే భారత్, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్ ప్లేయ‌ర్స్‌తో క‌లిసి తాము కూడా యూకే వెళ్లిపోతామ‌ని.. అక్క‌డి నుంచి ఆస్ట్రేలియా వెళతామని తన మాస్టర్ ప్లాన్ గురించి తెలిపాడు. భారత్, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్ ఆటగాళ్లను చార్ట‌ర్డ్ విమానంలో తీసుకెళ్తారని.. వాళ్ల‌తో పాటే ఆసీస్ ప్లేయ‌ర్స్‌ను తీసుకెళ్లే ఆలోచ‌న చేస్తున్న‌ట్లు బీసీసీఐ అధికారి ఒకరు చెప్ప‌డం విశేషం.

Related posts