telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత్ గురించి అలా మాట్లాడటం సరికాదు : ఆసీస్ ఓపెనర్

భారత దేశంలో ఉన్న సోదరసోదరీమణులు బాగుండాలి ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్‌ కోరుకున్నాడు. భారత్‌ అంటే హెడెన్‌కు ప్రత్యేక అభిమానం అన్న సంగతి తెలిసిందే. ఎన్నోసార్లు అతడు ఈ విషయాన్ని స్వయంగా తెలిపాడు. మాథ్యూ హెడెన్‌ కరోనా సంక్షోభం గురించి మాట్లాడుతూ… ‘వ్యక్తిగతంగా నాకెన్నో పాఠాలు నేర్పిన దేశం పట్ల నాకెంతో ప్రేమ, సానుభూతి ఉన్నాయి. ఇండియాతో పాటు అక్కడి మనుషులతో నాకు ఏదో తెలియని బంధం ఉంది. అక్కడ భిన్న సంస్కృతుల సమ్మేళనం. భారత దేశంలో చాలామంది సోదరసోదరీమణులు ఉన్నారు. ఆస్ట్రేలియాలో 700000 కుటుంబాలు ఉన్నాయి. మేము భారతదేశానికి 15 టన్నుల వైద్య సామాగ్రి, 3000 వెంటిలేటర్లు మరియు వంద ఆక్సిజన్ వెంటిలేటర్లను పంపాము’ అని అన్నాడు. ‘ప్రస్తుతం మిగతా దేశాలతో పోలిస్తే.. అత్యధిక జనాభా ఉన్న భారత్ తీవ్ర సవాళ్లు ఎదుర్కొంటోంది. అక్కడి ప్రజలు చాలా దయగలిగిన వారు. ఇతరుల పట్ల ప్రేమానురాగాలు చూపిస్తారు. త్వరలోనే వారు మళ్లీ మునుపటి జీవితాన్ని గడుపుతారు. మూడు దశాబ్దాలుగా ఓ యాత్రికుడిగా, ఓ సోదరుడిగా వారి ఆప్యాయతను పొందుతున్నాను. అందుకు నేనెంతో గర్వపడుతున్నాను. అలాంటి అందమైన దేశం గురించి పూర్తిగా తెలుసుకోకుండా కొంతమంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అది సరికాదు. కరోనాపై పోరులో భారత్‌ బాగానే పనిచేస్తోంది. కఠిన సమయాల్లో వారికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది’ అని హెడెన్‌ పేర్కొన్నాడు.

Related posts