telugu navyamedia
telugu cinema news trending

దీపావళి కానుకగా..”మాస్టర్‌” టీజర్‌ రిలీజ్‌..

ఇళయ దళపతి విజయ్ హీరోగా ఇటీవల ‘ఖైదీ’ చిత్రంతో ఆకట్టుకున్న లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మాస్టర్’. ఎక్స్ బి ఫిలిమ్ క్రియేటర్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాలో విజయ్ సరసన మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఆండ్రియా జెరెమియా, అర్జున్ దాస్, నాజర్, సంజీవ్, సంతానం ఇతర పాత్రల్లోనూ, ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌, రీరికార్డింగ్‌, డబ్బింగ్‌ పూర్తయి తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్‌ తొమ్మిదిన ఈ చిత్రం విడుదల కావాల్సి వుండగా లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు మూతపడటంతో రిలీజ్‌ కాలేక పోయింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ ముగిసిన వెంటనే థియేటర్లలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత జేవియర్‌ బిరిటో ప్రకటించారు. అయితే ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సహా అన్ని ఓటీటీ సంస్థలు ‘మాస్టర్‌’ చిత్రాన్ని కొనేందుకు పోటీపడుతున్నాయి. తాజాగా దీపావళి కానుకగా మాస్టర్‌ టీజర్‌ ను విడుదల చేశారు. ఇప్పుడు ఈ టీజర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ టీజర్‌లో విజయ్‌ చెప్పే డైలాగ్స్‌ అందరికీ మత్తేక్కిస్తాయి.

Related posts

బిగ్ బాస్ షో పై కేసు .. శ్వేతారెడ్డి ఫిర్యాదు ..

vimala p

“ఓ మై క‌డవులే” చిత్రం తెలుగు రీమేక్

vimala p

నిన్న వీళ్లే ఉత్తములన్నారు … నేడు వాళ్ళే అనివినిపారులంటున్నారు .. ఇదేమి రాజకీయమో..

vimala p