telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

విమానాశ్రయం సమీపంలో ఉన్నట్టుండి ఏర్పడిన పెద్ద రంధ్రాలు… చూస్తుండగానే వాహనాలు…

Holes

బుధవారం తెల్లవారుజామున ఫ్లోరిడాలోని ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో గ్రాఫిక్స్ ను తలపించేలా ఉన్నట్టుండి భూమిలో రంధ్రాలు ఏర్పడిన సంఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై ఉన్నట్టుండి రెండు పెద్ద రంధ్రాలు ఏర్పడి నిలిపి ఉన్న వాహనాలతో పాటు మొబైల్ హోమ్‌ను కూడా చూస్తుండగానే లోపలకు లాగేసుకున్నాయి. దీంతో పదుల సంఖ్యలో వాహనాలు ఆ పగుళ్లలో పడి ధ్వంసమైనట్లు ఆరేంజ్ కౌంటీ ఫైర్ రెస్క్యూ సిబ్బంది వెల్లడించింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఓర్లాండో అధికారులు తెలిపారు. కాగా స్థానికంగా ఉండే ఓ ట్రక్ వ్యాపారవేత్త మాత్రం ఈ ఘటన జరిగిన ప్రదేశానికి సమీపంలో ఓ సరస్సు ఉండేదని, ఇప్పుడు అది ఎండిపోవడంతో దాని ప్రభావంతోనే ఇలా భూమిలో పగుళ్లు వచ్చి ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు. ధ్వంసమైన వాహనాలను బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది, పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇప్పటికీ అధికారులకు ఈ రంధ్రాలు ఎలా ఏర్పడ్డాయో అర్థంకావడం లేదు.

Related posts