telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

14 ఏళ్ళ పోరాటానికి.. న్యాయం ఎప్పుడో… అక్కడ అత్యాచారాలు మామూలేనట…

women gang raped in capital of india

ఓ యువకుడు తనకు కాబోయే భార్యపై కొందరు యువకులు సామూహిక అత్యాచారం చేశారని తెలిసి కూడా వివాహం చేసుకున్నాడు. అంతేకాకుండా సదరు నిందితులపై భార్యతో కలిసి న్యాయపోరాటం మొదలుపెట్టారు. ఈ ఘటన హరియాణా రాష్ట్రంలో చోటుచేసుకుంది. హరియాణాలోని ఛత్తర్ అనే గ్రామానికి చెందిన జితేందర్ ఖత్తర్ పక్క గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరు పెళ్లి చేసుకునేందుకు ఇరు కుటుంబాలు అంగీకరించాయి. ‘నిశ్చితార్థం అయిపోయాక ఓ రోజు నా జీవితంలో మర్చిపోలేని సంఘటన గురించి వినాల్సి వచ్చింది. నాకు కాబోయే భార్య ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని రమ్మంది. నేను వెళ్లాను. తనపై సామూహిక అత్యాచారం జరిగిందనీ, పెళ్లి చేసుకోవడానికి తాను అర్హురాలిని కానని కుమిలిపోయింది. అది వినగానే నా కళ్లలో నీళ్లు. ఎవరో చేసిన తప్పుకు ఆమెను శిక్షించడం సబబు కాదనిపించింది’

‘ఆమెను పెళ్లి చేసుకుంటాననే కాదు.. న్యాయం జరిగేలా చూస్తానని కూడా మాటిచ్చా. అలా మా పెళ్లికి ముందే నా న్యాయ పోరాటం మొదలైంది. హరియాణాలో అత్యాచారాలు ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ బాధితుల నోళ్లు మూయించేస్తుంటారు. పరువు పోతుందని. సమాజం ఆడవారినే తప్పుబడుతుందన్న ఘటనలు మనం చూస్తున్నాం కదా. నా స్థానంలో మరో అబ్బాయి ఉండి ఉంటే కచ్చితంగా పెళ్లికి ఒప్పుకొనేవాడు కాదు. అత్యాచార బాధితులకు సమాజంలో గౌరవం ఉండదు. నా భార్యకు మాటిచ్చినట్లుగానే అత్యాచారానికి పాల్పడిన 8 మంది నిందితులపై కేసు పెట్టాను’, ‘లాయర్లతో మాట్లాడుకున్నాను. కానీ మాకు బెదిరింపులు ఎదురయ్యాయి. అన్నీ తట్టుకున్నాను. కేసు గెలవడం కోసం రెండు ఇళ్ల స్థలాలు కూడా అమ్ముకున్నాను. నిందితుల్లో కొందరు పలుకుబడి ఉన్నవారట. దాంతో జిల్లా సెషన్స్‌ న్యాయస్థానం వారిని నిర్దోషులుగా తేల్చింది. దాంతో నేను హైకోర్టును ఆశ్రయించాను. నా భార్య నిద్రపోవడానికి కూడా భయపడేది.

ఆమె కోసం నా వ్యాపారాలను వదులుకుని ఆమె పుట్టింటికి సమీపంలో ఓ ఇల్లు తీసుకున్నాను. అలా దాదాపు 14 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నాను. ప్రస్తుతం నేను లా చదువుతున్నాను. పోలీసులు, న్యాయవాదులను నమ్ముకుంటే నాకు జరిగే మేలు ఏమీ లేదనిపించింది. అందుకే త్వరగా చదువు పూర్తిచేసి నా భార్య కేసును నేనే వాదించుకుంటాను’ అని తెలిపారు. ఇప్పుడు తన భార్య కూడా లా చదువుతోందని జితేందర్ వెల్లడించాడు. వీరికి న్యాయం జరిగేనా.. అయితే ఎప్పటికి. అత్యాచారాలు జరగటం సాధారణమైన ప్రాంతాలు ఇంకా ఉన్నాయా.. మరి ఇంత పెద్ద రక్షణ వ్యవస్థ దేనికోసం !!!

Related posts