telugu navyamedia
సినిమా వార్తలు

“డిస్కోరాజా” విడుదలకు ముహూర్తం ఖరారు

Disco

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో “డిస్కో రాజా” అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ దర్శకుడు గతంలో ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’ వంటి చిత్రాలను రూపొందించి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. “డిస్కో రాజా” చిత్రాన్ని ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మించ‌నున్నారు. నభా నటేశ్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, సునీల్‌ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ చిత్రం కొంత భాగం చెన్నై నేప‌థ్యంలో సాగనున్న‌నేప‌థ్యంలో త‌మిళ స్టార్ బాబీ సింహాని ప్ర‌తి నాయ‌కుడిగా ఎంపిక చేశార‌ని తెలుస్తుంది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర ప్రీ లుక్ ఇటీవ‌ల విడుద‌లైంది. ఇందులో ర‌వితేజ డ్యూయ‌ల్ రోల్ పోషిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అయితే రీసెంట్ గా రవితేజ యంగ్ లుక్ అంటూ ఒక పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై ద‌ర్శ‌కుడు ఆనంద్ ఆ ఫోటో రవితేజాది కాదంటూ తన ట్విట్ట‌ర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ సెప్టెంబ‌ర్ 2న వినాయ‌క చవితి సంద‌ర్భంగా రివీల్ చేయ‌నున్న‌ట్టు తెలిపారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 20, 2019న‌ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు నిర్మాత‌లు కొద్ది సేప‌టి క్రితం ప్ర‌కటించారు. ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం అందించ‌డం ఖాయ‌మ‌ని దర్శకనిర్మాతలు నమ్మకంతో ఉన్నారు.

Related posts