telugu navyamedia
క్రీడలు వార్తలు

ఇక అక్కడ మాస్క్‌లు అవ‌స‌రంలేదు…

corona mask

కరోనా మొత్తం ప్రపంచంతో పాటుగా ఫ్రాన్స్‌ను కూడా అత‌లాకుత‌లం చేసింది. అయితే, ఇప్పుడు క్ర‌మంగా అక్క‌డ ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చింది.. కేసులు త‌గ్గిపోయాయి.. మ‌రోవైపు వ్యాక్సినేష‌న్ కూడా పుంజుకుంది… దీంతో.. కీల‌క నిర్ణ‌యం తీసుకుంది ఫ్రాన్స్.. ఈ నెల 20వ తేదీ నుంచి రాత్రికర్ఫ్యూను సడలించాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చింది. అంతేకాదు, ఇక‌పై బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించడం కూడా తప్పనిసరి కాదని ప్రకటించారు… కాగా, ఫ్రాన్స్‌లో రాత్రికర్ఫ్యూతోపాటు బయటికొస్తే మాస్కు తప్పనిసరిగా ధరించాలన్న నిబంధన ఉంది.. గత ఏడాది నుంచి ఈ నిబంధ‌న‌లు అమలులో ఉన్నాయి.. మ‌రోవైపు ఇక నుంచి రాత్రి క‌ర్ఫ్యూ రాత్రి 11 గంట‌ల నుంచి అమ‌ల్లోకి రానుంది. కాగా, భార‌త్‌లో కూడా క‌రోనా కేసులు భారీగా త‌గ్గుముఖం ప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే చూడాలి మరి మన దేశంలో ఆ పరిస్థితి ఎప్పుడు వస్తుంది అనేది.

Related posts