telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

మారుతి సుజుకీ .. రెండో త్రైమాసిక ఫలితాలలో … 38 శాతం తగ్గిన లాభాలు…

maruti suzuki second quarter results

మారుతీ సుజుకీ తాజాగా రెండో త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. సెప్టెంబరు 30తో ముగిసిన ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 1,391.1కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన ఏకీకృత రూ. 2,280.2కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 38.99శాతం తక్కువ కావడం గమనార్హం. ఆటోమొబైల్‌ రంగంలో నెలకొన్న సంక్షోభం పరిస్థితుల వల్లే మారుతి లాభాలు తగ్గినట్లు మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

సంస్థ ఆదాయం కూడా 25.19శాతం తగ్గినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌ సందర్భంగా మారుతీ సుజుకీ పేర్కొంది. రెండో త్రైమాసికంలో కంపెనీ రూ. 16,123.2కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 21,553.7కోట్లుగా నమోదైంది. సంక్షోభం కారణంగా ఇటీవల కాలంలో ఆటోమొబైల్ విక్రయాలు తగ్గిన విషయం తెలిసిందే. రెండో త్రైమాసికంలో మారుతీ విక్రయాలు 30.2శాతం క్షీణించాయి. జులై-సెప్టెంబరు మధ్య కంపెనీ 3,38,317 యూనిట్ల వాహనాలు విక్రయించింది.

Related posts