telugu navyamedia
culture trending

మా అమ్మాయిని పెళ్లాడితే.. 2 కోట్లు ఇస్తా.. !

marry my daughter and get 2 cr

నా కూతురు వయసు 26, అందంగా ఉంటుంది. వరుడు కావలెను..పెళ్లి చేసుకున్న వారికి 2 కోట్లు ఇస్తాను అంటున్నాడు ఆ తండ్రి. అంత డబ్బు ఆఫర్ చేసినప్పుడే అతడు సామాన్యుడు కాదని అర్ధం చేసుకోవచ్చు. నిజమే ఆయన దేశంలో సంపన్న వర్గానికి చెందిన వాడు. కుమార్తె వివాహం చేయదలిచి ఈ ఆఫర్ సామజిక మాధ్యమాలలో ప్రకటన చేసేశాడు. తండ్రి కదా మరి, కూతురికి పెళ్లి చేయాలనే దిగులుతో, పెళ్లి కొడుకు కోసం ఈ దారి ఎంచుకున్నాడు. అసలైతే వారి దేశంలో కట్నకానుకలు ఇవ్వడం లాంటివి లేవు సరికదా, కన్యాశుల్కం ఆచారం ఉంది.

అయినా ఇంత డబ్బు ఎందుకు ఆఫర్ చేస్తున్నాడంటే, తన కూతురిని జీవితాంతం సంతోషంగా చూసుకునే వాడి కోసమట. అంతటితో ఆగకుండా, తన వ్యాపారాన్ని కూడా అల్లుడికే అప్పగించి, ఆయన రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాడట. ఇక మరో ఆఫర్ కూడా పరోక్షంగా ఉన్నట్టే, ఏమంటే తన దేశంలో ఉన్న ఆచారం ప్రకారం తనకు ఎటువంటి కన్యాశుల్కం ఇవ్వాల్సిన పనిలేదని కూడా ప్రకటనలో పొందుపరచడం విశేషం. తన అల్లుడు గొప్ప చదువులు చదవకపోయినా పరవాలేదంటున్నాడు ఆ తండ్రి, పలానా దేశస్తుడి కావాలని కూడా నియమం లేదట.

ఇక తన తండ్రి ప్రకటన చూసిన తరువాత వచ్చిన స్పందనను చూసి పెళ్లికూతురు ఏమన్నదంటే; తనకు కాబోయే వాడికి పైసా కూడా మిగలకపోవచ్చట, ఏమంటే తన ప్లాస్టిక్ సర్జరీ లకే ఉన్న డబ్బంతా తగలేస్తా అంటుంది. ఇది విన్నాక ఇంకేం స్పందన, అంతా నిరసించిపోలా.. !! నాన్న ప్రకటనకు భలే కళ్లెం వేసింది కదా ఆ కూతురు. ఇంత వింత తండ్రి కూతుళ్లు అసలు ఎక్కడ ఉన్నారో చెప్పనేలేదుకదా.. వీరిది థాయిలాండ్. పేర్లు అవసరమా.. ఎవరో పుల్లయ్య, పుల్లమ్మ.. !! అదేఅదే థాయిలాండ్ పుల్లమ్మ..!

Related posts

పోరి సూపర్ ఉంది.. అందుకే నెంబర్ అడిగా.. అయితే ఏంటి..: ఓ ఇన్విజిలేటర్

vimala p

జనతా కర్ఫ్యూని అందరు తమ విధిగా పాటించండి: కేసీఆర్

vimala p

గర్ల్ ఫ్రెండ్ తో తిరగొద్దంటూ స్టార్ హీరోయిన్ కు దర్శకుడి హెచ్చరిక

vimala p