telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

పక్కింటి అమ్మాయితో .. లేచిపోయిన.. యువ నటుడు…

married young actor unnatural behavior

సినిమాలలో నటించమంటే జీవించేవారు కూడా ఉంటారు. ఆ కోవకే చెందిన ఒక యువ నటుడు, సినిమాల ప్రభావంతోనేమో, తన పక్కింటి అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అంతటితో ఊరుకోలేదు, వివాహితుడు అయినప్పటికీ, అతగాడి తల్లిదండ్రులు వరించినప్పటికీ.. వినకుండా, ఆ అమ్మాయితో పారిపోయాడు. తిరువణ్ణామలై జిల్లాలోని చెంజి గ్రామానికి చెందిన శివ సినిమాలలో నటిస్తుంటాడు. ఇతను హీరోగా ‘పయపుళై’ అనే సినిమా వచ్చింది. అయితే ఆ తర్వాత పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో చిన్నచిన్న పాత్రలు పోషిస్తూ జీవితం గడుపుతున్నాడు. ఇతను రామావరం ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఈ క్రమంలో పక్కింటిలో ఉండే ఓ యువతితో శివకు పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా ప్రేమగా మారడంతో అమ్మాయి తల్లిదండ్రులు ఆమెను మందలించారు. తనకు ఇప్పటికే పెళ్లయిందనీ, విడాకులు తీసుకున్నానని నమ్మబలికిన శివ.. యువతిని తీసుకుని ఇంటి నుంచి పరారయ్యాడు.

ఒకరోజు, కుమార్తె కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు గాలింపును తీవ్రం చేశారు. తమ గురించి పోలీసులు వెతుకుతున్నారని తెలుసుకున్న ఈ జంట పోలీసుల ముందు లొంగిపోయింది. కాగా, తన భార్యకు విడాకులు ఇచ్చి యువతిని పెళ్లి చేసుకుంటానని శివ ఈ సందర్భంగా పోలీసులకు తెలిపాడు. కాగా, యువతి తల్లిదండ్రులను స్టేషన్ కు పిలిపించిన అధికారులు కుమార్తెను వారికి అప్పగించారు. ఇప్పటికైనా అందరికి అర్ధం అయిఉంటుంది.. ఈ చెత్త సినిమాల ప్రభావం పిల్లలపై, ముఖ్యంగా యువతపై ఎంతగా ఉందొ అని. అయినా ఏమి మారవు కానీ, స్వతహాగా అయినా మారితే మంచిది. లేదంటే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయి.

Related posts