telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మెగా కాంపౌండ్ లో పెళ్ళి భాజాలు ?

Varun-Tej

మెగా బ్రదర్ నాగబాబు ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త కుటుంబంతో వియ్యం అందుకోబోతున్నాడు అనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో గుప్పుముంటున్నాయి. అయితే ఈ పెళ్ళి నిహారికదేనా అనే అనుమానాలు బయలుదేరాయి. కానీ అందుతున్న సమాచారం మేరకు నాగబాబు కుదిర్చిన ఈ సంబంధం వరుణ్ తేజ్ కి అని తెలుస్తోంది. నిహారిక తాను పెళ్ళి చేసుకోవడానికి కొంత సమయం కావాలి అని అడగడంతో నాగబాబు వరుణ్ తేజ్ కి పెద్దలు నిశ్చయించిన పెళ్ళి వైపు అడుగులు వేస్తున్నట్లు టాక్. ప్రముఖ పారిశ్రామిక వేత్త కుటుంబానికి చెందిన ఆ అమ్మాయి వరుణ్ తేజ్ కు అన్నివిధాల సరిపోతుందని నాగబాబు అభిప్రాయానికి రావడంతో ఈ పెళ్ళి సంబంధం పై ఒక నిర్ణయం మెగా బ్రదర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు కొద్ది కాలం క్రితం వరుణ్ తేజ్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మొదట్లో పెళ్ళి పట్ల తనకు ఆసక్తి లేకపోయినా ‘ఎఫ్ 2’ లో నటించిన తరువాత తన పెళ్లి ఆలోచనలలో మార్పులు వచ్చాయి అని చెప్పిన కొద్ది రోజులకు ఈ పెళ్ళి వార్తలు గుప్పుమనడంతో ఈ వార్తలు నిజమే అన్న అభిప్రాయం కలుగుతోంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ నటిస్తున్న “వాల్మీకి” మూవీ రిలీజ్ కు రెడీ అయిన నేపధ్యంలో ఈ మూవీ హడావిడి అంతా పూర్తి అయిన తరువాత ఈ వార్తల పై ఒక క్లారిటీ వచ్చే ఆస్కారం ఉంది అని అంటున్నారు. ఈ యంగ్ హీరో ఇప్పటి వరకు చాలామంది క్రేజీ హీరోయిన్స్ తో నటించినా ఎక్కడా గాసిప్ లకు ఆస్కారం ఇవ్వకుండా వరుణ్ వ్యవహరిస్తూ వచ్చాడు. దీనితో నిజంగానే వరుణ్ ఇలా పెద్దల కుదర్చిన పెళ్లి చేసుకుంటే మెగా యంగ్ హీరోలలో ఎరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న మొదటి మెగా యంగ్ హీరోగా పేరు సంపాదిస్తాడు. అయితే ప్రస్తుతం వరుణ్ కు కాబోయే భార్య ఎవరన్న విషయమై సోషల్ మీడియాలో హాట్ గా చర్చ నడుస్తోంది.

Related posts