telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

చర్చ్‌లో పెళ్లి అడ్డుకున్న యువతి

క్రైస్తవ సాంప్రదాయ పద్దతిలో జరుగుతున్న పెళ్లిని ఓ యువతి అడ్డుకుంది. దీంతో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పవర్‌పేటలోని చర్చ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. చర్చ్‌లో జరుగుతున్న పెళ్లిని తెనాలికి చెందిన ఓ యువతి అడ్డుకుంది. పెళ్లి కొడుకు డేవిడ్ తనను ప్రేమపేరుతో మోసం చేశాడంటూ వాపోయింది. వివరాల్లోకి వెళ్తే.. తెనాలికి చెందిన యువతితో డేవిడ్ అనే యువకుడు ప్రేమపేరుతో కలిసి తిరిగాడు. ఇంతలో మరో యువతిని పెళ్లి చేసుకోబోతుండగా ఆమె అడ్డుకుంది. వివాహాన్ని అడ్డుకున్న యువతిని చర్చ్ ఫాస్టర్ బలవంతంగా గెంటివేశారు. వీడియో తీసుకున్న మీడియా ప్రతినిధులపై కూడా దాడికి పాల్పడ్డారు.

Related posts