telugu navyamedia
సినిమా వార్తలు

నారాయణమూర్తి పెళ్లి చేసుకున్నారు… : మెగాస్టార్

Marketlo-Prajaswamyam

ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి న‌టిస్తూ ద‌ర్శ‌క‌నిర్మాణం చేసిన చిత్రం “మార్కెట్లో ప్ర‌జాస్వామ్యం”. ఈ సినిమా ప్రీ రీలీజ్ కార్య‌క్ర‌మానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ “నారాయ‌ణ మూర్తిది ప్యూర్ హార్ట్‌. 1978లో నేను “ప్రాణం ఖ‌రీదు” చేస్తున్న‌ప్పుడు నూత‌న్ ప్ర‌సాద్‌కి పేప‌ర్ అందించే కుర్రాడిగా న‌టించారు. ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి. అప్పుడే తొలిసారి మేం మాట్లాడుకున్నాం. ఆ త‌ర్వాత పాండిబ‌జార్‌లో అప్పుడ‌ప్పుడూ క‌లిసి మాట్లాడుకునేవాళ్లం. ఆ త‌ర్వాత నుంచీ మా మ‌ధ్య స్నేహం ఉంది. అప్ప‌టి నారాయ‌ణ‌మూర్తి, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. మ‌నిషి ఎంత ఎదిగినా, ఎంత సాధించినా స‌రే, ఆయ‌న మాన‌సికంగా మార‌లేదు.

నారాయ‌ణ‌మూర్తి సినిమాల‌ను విప‌రీతంగా ప్రేమిస్తాడు. ఆయ‌న ఈ స్థాయికి రావ‌డానికి కార‌ణం ఆయ‌న క‌ష్ట‌మే. అలుపెర‌గ‌కుండా పోరాడారు. ఆయ‌న దీక్ష‌, ప‌ట్టుద‌ల స్ఫూర్తివంత‌మైన‌వి. కమ్యూనిజం భావ‌జాలంతో సినిమాలు చేశాడు. ఇన్నేళ్లు అదే క‌మిట్‌మెంట్‌తో సినిమాలు చేస్తూ వస్తున్నారు. సినిమాల్లో ఎవ‌రైనా క‌మ‌ర్షియ‌ల్ సినిమాల వైపు ఆక‌ర్షితుల‌వుతారు.

కానీ టెంప‌ర్ సినిమాలో మంచి పాత్ర‌ను ఇచ్చిన నో చెప్పాడంటే అదే నారాయ‌ణ‌మూర్తి. ఇలాంటి వ్య‌క్తులు సినిమా ఇండ‌స్ట్రీలో వెతికినా దొర‌క‌డు. అరుదైన వ్య‌క్తి నారాయ‌ణ‌మూర్తి. సినిమానే ఆయ‌న పెళ్లి చేసుకున్నారు. సినిమాల‌తోనే ఆయ‌న జీవిస్తున్నారు. “మార్కెట్లో ప్ర‌జాస్వామ్యం” ఆయ‌న‌కు పెద్ద హిట్ కావాలి. నారాయ‌ణ‌మూర్తి గారు నన్ను ఎప్పుడూ పిల‌వ‌లేదు. న‌న్ను పిల‌వాల‌నే భావ‌న ఆయ‌న‌కు రావ‌డం చాలా ఆనందంగా ఉంది. నేను అభిమానించే మంచి మిత్రుడు నారాయ‌ణమూర్తి” అన్నారు.

ఈ సందర్భంగా ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ… “మీరు నా సినిమా ఆడియో ఫంక్షన్ కి వస్తే సినిమాకు ప్రమోషన్ హెల్ప్ అవుతుందని చెప్పగానే మెగాస్టార్ ఏ మాత్రం ఆలోచించకుండా వస్తానని చెప్పారు. మంచి మనసున్న వ్యక్తి నా సినిమా కోసం వచ్చినందుకు కృతజ్ఞతలు. ప్రాణం ఖరీదు సినిమా షూటింగ్ లో మెగాస్టార్ హీరోగా చేసినప్పుడు. నేను జూనియర్ ఆర్టిస్ట్. అప్పుడు మెగాస్టార్ చిరంజీవి, నూతన ప్రసాద్, చంద్రమోహన్ ని రాజమండ్రి అప్సర లాడ్జ్ లో ఉంచారు. నన్ను కూడా అక్కడే ఉంచి మంచి భోజనం పెడతారని అనుకున్నా. కానీ ఒక వంటపాకలో నన్ను ఉంచారు. అప్పుడు దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి నాకు కంపెనీ ఇచ్చారు” అంటూ నారాయణ మూర్తి తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

Related posts