telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రెండోసారి కూడా మాట తప్పారు..సీఎం కేసీఆర్ కు మావోయిస్టుల వార్నింగ్!

cm kcr red signal to 3 sitting mps

తెలంగాణ సీఎం కేసీఆర్ కు మావోయిస్టులు హెచ్చరికలు జారీచేశారు. దశాబ్దాలుగా ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇస్తామన్న కేసీఆర్, రెండోసారి అధికారంలోకి వచ్చాక కూడా మాట తప్పారని మండిపడ్డారు. తెలంగాణ హరితహారం పథకం పేరుతో కేసీఆర్ ప్రభుత్వం ఆదివాసీల భూములు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తోందని మావోలు ఆరోపించారు. ఈ మేరకు మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల అయింది. కేసీఆర్ ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలనీ, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని లేఖలో జగన్ హెచ్చరించారు.

దీంతో అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ ను ముమ్మరం చేశారు.పాణహిత తీరంనుంచి వచ్చే ప్రయాణీకులను తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడేమీ జరుగుతుందోనని పరిసరప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Related posts