Trending Today రివ్యూలు సమీక్ష వార్తలు సినిమా వార్తలు

“మను” మా వ్యూ

manu-Telugu-Movie

నటీనటులు : గౌతమ్, చాందినీ చౌదరి, మోహన్ భగత్, శ్రీకాంత్, జాన్ కొట్టొలి, అభిరామ్ వర్మ తదితరులు
దర్శకత్వం : ఫణీంద్ర నరిశెట్టి
సంగీతం : నరేష్ కుమరన్
నిర్మాతలు : చిత్ర యూనిట్ తో పాటు 115 మంది (క్రౌడ్ ఫండింగ్ మూవీ)
కెమెరామెన్ : విశ్వనాథ్ రెడ్డి

షార్ట్ ఫిలిమ్స్ తో మంచి పాపులరిటీ సంపాదించుకున్న దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో రాజా గౌతమ్ – చాందిని చౌదరి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ‘మను’. ఈ సినిమా తక్కువ బడ్జెట్ తో క్రౌడ్ ఫండింగ్ తో తెరకెక్కిన సినిమా. ప్రముఖ దర్శకుడు క్రిష్, కేరాఫ్ కంచరపాలెం మూవీ దర్శకుడు మహా వెంకటేష్, హీరో వరుణ్ తేజ్ “మను” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధులుగా విచ్చేసి ప్రమోట్ చేయడంతో సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. బ్రహ్మానందం తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పల్లకిలో పెళ్లికూతురు, బసంతి లాంటి విభిన్నమైన చిత్రాల్లో నటించి, తనను తాను నిరూపించుకోవడానికి గౌతమ్ ప్రయత్నిస్తున్నాడు. కానీ ఇప్పటివరకు ఒక్క సక్సెస్ ను కూడా అందుకోలేకపోయారు. మరి ఈ చిత్రమైనా గౌతమ్ కు విజయాన్ని అందించిందో లేదో చూద్దాం.

కథ :
ఈస్ట్ కోస్ట్ తీరంలో సియా అనే దీవిలో ఫోటో స్టూడియోను నడుపుతుంది నీల (చాందిని). తండ్రితోపాటు అక్కడే ఉంటుంది. అదే ప్రాంతంలో ఉండే పెయింటర్ మను (రాజా గౌతమ్). వీరిద్దరి తొలి పరిచయంలోనే గొడవ పడతారు. మను ఆర్ట్ వర్క్ ను ఇష్టపడుతుంది నీల. ఆ తరువాత ఇద్దరూ ప్రేమలో పడతారు. వీరిద్దరూ ప్రేమ ప్రేక్షుల్లా హ్యాపీగా ఉంటారు. అంతా బాగుంది అనుకునే సమయంలోనే అమర్ అక్బర్ ఆంటోనీ (శ్రీకాంత్, జాన్ కొట్టొలి, మోహన్ భగవత్)లతో పాటు రంగ (అభిరామ్ వర్మ) అనే నలుగురు స్నేహితులు వీళ్ళ జీవితాల్లోకి వస్తారు. దాంతో వీరిద్దరి జీవితాల్లో అనుకోని పరిస్థితులు, ఊహించని మలుపులు వస్తాయి. ఆ పరిస్థితులు ఏంటి ? వాటిని మను, నీల ఎలా ఎదుర్కొన్నారు ? అసలు ఆ నలుగురు స్నేహితులు కలిసి చేసిన పనేంటి ? చివరకు మను, నీల ఏమయ్యారు ? అనేవి వెండి తెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
పల్లకిలో పెళ్లికూతురు, బసంతి సినిమాల్లో కలిపించిన గౌతమ్ లా ఈ సినిమాలో అస్సలు కన్పించలేదు. పూర్తిగా కొత్త లుక్ లో కన్పించదు రాజా గౌతమ్. డైలాగ్ డెలివరీ, నటన పరంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ చాందిని చౌదరికి చాలా రోజుల తరువాత నటించడానికి అవకాశమున్న పాత్ర దక్కింది. నటనతో తన హావభావాలతో నీల పాత్ర పరిధిమేర బాగా నటించింది. ఇక మిగతా నటులైన శ్రీకాంత్, జాన్ కొట్టొలి, అభిరాం వర్మ, మోహన్ భగత్ లు కూడా తమ పరిధిమేర నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు :
దర్శకుడు ఫణీంద్ర తాను రాసుకున్న మంచి కథను తెరపై అంతే గొప్పగా చూపించలేకపోయారు. కథనాన్ని ప్రేక్షకులను సరిగ్గా చూపించడంలో తడబడ్డాడు. సన్నివేశాలను సాగదీస్తూ, ప్రేక్షకులను గందరగోళానికి గురిచేశాడు. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా కంటే సీరియల్సే బెటర్ అన్పిస్తుంది. ప్రథమార్థంలో ఉన్న ఆసక్తి ద్వితీయార్థంలో ఉండదు. ఇక నరేష్ కుమరన్ నేపథ్యం సంగీతం, విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలం.

రేటింగ్ : 2/5

Related posts

‘మీ పెద్దోళ్ళు ఉన్నారే…’.. ఇక లేరు…వైజాగ్ ప్రసాద్ మృతి..

chandra sekkhar

30 ఏళ్ల‌కు ముందు రామ్‌గోపాల్ వ‌ర్మ‌ను చూసిన‌ట్టు అనిపించింది -అలీ

vimala t

పురిటినొప్పులు సైతం అనుభవించి కన్న బిడ్డను 10వేలకు అమ్మాలనుకున్న తల్లి..!

nagaraj chanti

Leave a Comment