telugu navyamedia
రాజకీయ వార్తలు

రేపే హరియాణా సీఎంగా ఖట్టర్‌ ప్రమాణ స్వీకారం

Manohar Lal Khattar after returning from foreign trip

హ‌ర్యానా సీఎంగా మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ రెండోసారి పగ్గాలు చేపట్టనున్నారు. బీజేఎల్పీ సమావేశంలో ఆయన శాసనసభా పక్ష నేతగా శనివారం ఎన్నికయ్యారు. దీంతో ఖట్టర్‌ ఆదివారం మధ్యాహ్నం సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీకి 40 సీట్లు ద‌క్కిన విష‌యం తెలిసిందే. అయితే ప‌ది సీట్లు గెలిచిన దుశ్యంత్ చౌతాలాకు చెందిన జేజేపీ పార్టీ మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో.. ఖ‌ట్ట‌ర్ ప్ర‌భుత్వ ఏర్పాటుకు లైన్ క్లియ‌ర్ అయ్యింది. వివాదాస్ప‌ద స్వ‌తంత్య్ర ఎమ్మెల్యే గోపాల్ కండా మ‌ద్ద‌తు తీసుకోవ‌డంలేద‌ని మ‌రో బీజేపీ ఎమ్మెల్యే స్ప‌ష్టం చేశారు.

Related posts