telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వ్యాక్సిన్ విషయంలో మోడీకి భారత మాజీ ప్రధాని లేఖ…

manmohan singh comments on modi govt

ప్రస్తుతం భారత్ లో క‌రోనా వ్యాక్సినేష‌న్ కొన‌సాగుతోంది.. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా 12 కోట్ల మందికి పైగా వ్యాక్సినేష‌న్ పూర్తి చేసింది ప్ర‌భుత్వం.. అయితే, క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌పై ప్ర‌ధాని మోడీకి ప‌లు కీల‌క సూచ‌న‌లు చేశారు మ‌న్మోహ‌న్ సింగ్.. వ్యాక్సిన్‌ను మ‌రింత మందికి అందుబాటులోకి తేవాల‌ని కోరిన ఆయ‌న‌.. కోవిడ్ నియంత్ర‌ణ కోసం వ్యాక్సిన్‌ను సాధ్య‌మైనంత ఎక్కువ మందికి ఇవ్వ‌డం ఎంతైనా అవసరం ఉంద‌న్నారు. అయితే, ఇన్ని కోట్ల మందికి వ్యాక్సిన్లు వేశామ‌ని లెక్క‌లు చెప్ప‌డం కాదు.. అస‌లు జ‌నాభాలో ఎంత శాతం మందికి వ్యాక్సినేష‌న్ వేశాం అనేది ఎంతో కీల‌కమైన అంశంగా లేఖ‌లో పేర్కొన్నారు మ‌న్మోహ‌న్ సింగ్.. ఇక‌, వ్యాక్సిన్ల నిల్వ‌ల‌పై కూడా ప‌లు సూచ‌న‌లు చేశారు మాజీ ప్ర‌ధాని. రానున్న 6 నెల‌ల కోసం ఇప్పుడే వ్యాక్సిన్ల‌కు ఆర్డ‌ర్లు ఇవ్వాల‌ని సూచించిన ఆయ‌న‌.. వాటిని రాష్ట్రాల‌కు పంపే ప్లాన్ కూడా సిద్ధం చేసుకోవాల‌న్నారు.. అత్య‌వ‌స‌ర అవ‌స‌రాల కోసం 10 శాతం వ్యాక్సిన్లు మాత్ర‌మే కేంద్రం ద‌గ్గ‌ర ఉంచుకోవాల‌ని.. అస‌లు, వ్యాక్సిన్ అవ‌స‌రాలు రాష్ట్రాల‌కే తెలుసు కాబ‌ట్టి.. వాళ్ల‌కు వ్యాక్సిన్లు ఇస్తే.. నిల్వ‌ల‌ను బ‌ట్టి.. రాష్ట్రాలే నిర్ణ‌యం తీసుకుంటాయ‌ని మ‌న్మోహ‌న్ సింగ్ తెలిపారు.

Related posts