telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరోసారి “పోకిరి” కాంబినేషన్

Ram-Pothineni

రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ నిర్మాతగా, ఛార్మి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే “ఇస్మార్ట్ శంకర్” అనే టైటిల్ ను ఈ సినిమాకు ఖరారు చేసినట్టుగా ప్రకటించారు. హీరో రామ్ ఈ ఫస్ట్ లుక్ లో డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో, గడ్డంతో సిగరెట్ కలుస్తూ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయిక కోసం ఇంకా అన్వేషణ సాగుతోంది. ఈ సినిమా కోసం తెలుగు అమ్మాయినే హీరోయిన్ గా ఎంపిక చేస్తారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా మణిశర్మను ఎంపిక చేసారని తెలుస్తోంది. గతంలో పూరి, మణిశర్మ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా “పోకిరీ” చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. దీంతో మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే ఇప్పటినుంచే సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. ఇంతకాలం వరుస పరాజయాలతో సతమతమవుతున్న పూరి ఈ సినిమాతో హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు.

Related posts