telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దుమ్మురేపుతున్న “మణికర్ణిక” తెలుగు ట్రైలర్

Manikarnika

ఝాన్సీరాణి లక్ష్మీబాయి జీవితకథ ఆధారంగా కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చారిత్రాత్మక చిత్రం “మణికర్ణిక”. ఈ సినిమాకి క్రిష్ దర్శకుడిగా వ్యవహరించి ఆ తరువాత తప్పుకున్నారు. దీంతో కంగనానే దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ఈ చిత్రాన్ని పూర్తి చేసింది. ఇటీవల వదిలిన హిందీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ట్రైలర్ లో యుద్ధ విద్యలో ఝాన్సీ లక్ష్మీబాయి ఆరితేరడం… గుర్రపుస్వారిలో నైపుణ్యాన్ని కనబరచడం… వివాహం… కుమారుడికి తల్లి కావడం… ఆంగ్లేయ సైన్యంపై విరుచుకుపడటం .. భర్తను కోల్పోవడం వంటి సన్నివేశాలను అద్భుతంగా చూపించారు. ఇక కంగనా వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో ఎంతగా జీవించిందనేది ఈ ట్రైలర్ ను చూస్తే అర్థమైపోతుంది. జనవరి 25వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

తాజాగా తెలుగులో కూడా ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు. “సాహసవంతురాలైన యువతిగా… మహారాణిగా… మాతృమూర్తిగా… మహా యోధురాలిగా… ప్రతి భారతీయుడిలోనూ స్వాతంత్ర్య కాంక్షను రగిల్చే కాగడాను అవుతాను నేను… ఝాన్సీ మీకూ కావాలి… నాకూ కావాలి… బేధం ఏమిటంటే మీకు రాజ్యాధికారం కోసం కావాలి… నాకు మా ప్రజలకి సేవ చేసుకోవడానికి కావాలి” అంటూ కంగనా చెప్పే డైలాగులు బాగున్నాయి. ట్రైలర్ లో కంగనా ఉగ్రరూపం కన్పిస్తుంది.

Related posts