telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

దొరల పాలనపై యుద్ధం: మంద కృష్ణ

Manda Krishna

ఎన్నికలకు మూడేళ్ల ముందుగానే కేసీఆర్ దొరల పాలనపై యుద్ధం ప్రకటిస్తున్నట్టు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పేర్కొన్నారు. నిన్న హన్మకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 2023లో దొరల పాలనకు చరమగీతం పాడి రాజ్యాధికారాన్ని సాధిస్తామని అన్నారు. పేదల ప్రాణాలను గాలికి వదిలి, పేదల భూములను రాబందుల్లా పీక్కుతింటున్నారని ఆరోపించారు.

దళిత ముఖ్యమంత్రి హామీ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పిన కేసీఆర్ 2018 నాటికి ఆ ఊసే మర్చిపోయారని ఆరోపించారు. హామీ నిలబెట్టుకోకపోవడమే కాకుండా పేదల నుంచి ఇప్పటి వరకు లక్ష ఎకరాల భూమిని లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023లో దొరల పాలనకు స్వస్తి చెప్పి వరంగల్‌ను శాసన రాజధానిగా చేసుకుని అద్భుత పాలనకు శ్రీకారం చుడతామని తెలిపారు.

Related posts