telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మంచు విష్ణు కూతురికి “మీ ప్రేమ‌, ఆశీర్వాదం కావాలి”

Manchu-Vishnu

ప్రముఖ టాలీవుడ్ నటుడు మంచు విష్ణు 2009 మార్చిలో విరానిక‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. డిసెంబ‌ర్ 2011లో ఈ దంప‌తుల‌కి ట్విన్స్ జ‌న్మించారు. వారికి అరియానా, వివియానా అని పేరు పెట్టాడు. ఇక 2018లో వారికి మ‌రో బిడ్డ జ‌న్మించాడు. ఆ చిన్నారికి అవ్రామ్ భక్త అని పేరు పెట్టారు. అవ్రామ్ అంటే “ఎవరు ఆపలేరు” అని అర్ధమని విష్ణు తెలిపాడు. కాగా మంచు విష్ణు, విరానికా దంపతులకు ఆగస్టు 9న ఆడ శిశువుకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆ పాప‌కి “ఐరా విద్య” అని నామ‌క‌ర‌ణం చేశారు. పాప ఫోటోని ట్విట్ట‌ర్‌లో షేర్ చేసిన విష్ణు… “ఐరాకి మీ ప్రేమ‌, ఆశీర్వాదం కావాలి” అని కోరారు. ఇటీవ‌ల విష్ణు “ఈ స‌ల‌హా త‌న‌కి కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇచ్చింద‌ని ట్వీట్ లో తెలిపాడు విష్ణు. చాలా ఆలోచ‌న‌లు, చ‌ర్చ‌ల త‌ర్వాత నా భార్య డెలివ‌రీని కాజ‌ల్ స‌ల‌హాతో ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ ఇవ్వాలని అనుకుంటున్నాను” అని పేర్కొన్నాడు విష్ణు. మంచు విష్ణు ట్వీట్‌కి అత‌ని భార్య స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. “మిమ్మ‌ల్ని ఇద్ద‌రిని మామూలుగా కొట్ట‌ను. ఇందులో ఎలాంటి నేరం లేదు” అని విరానికా తెలిపింది. దీనికి విష్ణు… “కొన్ని హింసాత్మ‌క బెదిరింపుల వ‌ల‌న ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ ఇవ్వాల‌నే ఆలోచ‌న విర‌మించుకున్నాను. ఆమెకి మోహ‌న్ బాబు స‌పోర్ట్ ఉండ‌డంతో నిర్ణ‌యం మార్చుకోక త‌ప్ప‌లేదు” అని స‌ర‌దా కామెంట్స్ చేశాడు విష్ణు.

Related posts