telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఢీ” సీక్వెల్ కు రెడీ అవుతున్న మంచు విష్ణు

Manchu-Vishnu

మంచు విష్ణు- శ్రీనువైట్ల కాంబినేషన్‌లో 2007 సంవత్సరంలో విడుదలైన ‘ఢీ’ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే గతంలో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలకు సీక్వల్ తీయడానికి ఈ మధ్యకాలంలో బాగా ఆసక్తి చూపుతున్నారు దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే అందరి దృష్టి ‘ఢీ’ సీక్వల్‌పై పడింది. దీనికి తోడు ఇటీవల ‘ఢీ’ మూవీ విడుదలై 13 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ డైరెక్టర్ శ్రీను వైట్లను ‘ఢీ2’ ఎప్పుడు? అని మంచు విష్ణు ప్రశ్నించడంతో ప్రేక్షకులకు హింట్ దొరికింది. దీంతో ‘ఢీ2’ సినిమా రూపొంద‌నుంద‌ని జోరుగా వార్త‌లు షికారు చేశాయి. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు ఢీ సీక్వల్ రానుంది నిజమే అని, ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌పై శ్రీనువైట్ల వ‌ర్క్ చేస్తున్నార‌ని తెలిసింది. పైగా ఈ చిత్రాన్ని కమర్షియల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించనున్నారని, అలాగే చిత్రానికి ‘ఢీ అండ్ ఢీ’ అనే టైటిల్ ఫైనల్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. తెలుగు ప్రేక్షకులను మరింత ఆకర్షించేలా ”డేరింగ్ అండ్ డాషింగ్” అనే ట్యాగ్ లైన్ కూడా డిసైడ్ చేశారని టాక్. చూడాలి మరి మంచు విష్ణు డేరింగ్ అండ్ డాషింగ్‌గా ఎప్పుడు సెట్స్ పైకి వస్తారనేది.

Related posts