telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మంచు మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’ ఫస్ట్ లుక్

manoj

మంచు మనోజ్ సొంతంగా ఎంఎం ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి తొలి చిత్రం ‘అహం బ్రహ్మాస్మి’ని నిర్మిస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు. ఇప్పుడు ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. మూడు డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మనోజ్ లుక్ అదిరిపోయింది. ఈ ఫస్ట్ లుక్‌ను మంచు మనోజ్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘‘స్క్రీన్ మీద నా కొన్నేళ్ల విరామం తరవాత గట్టిగా అరవడానికి వస్తున్నాను. ఈ క్రైమ్, కామెడీ, యాక్షన్ ప్యాక్ట్ ఫిల్మ్‌తో కచ్చితంగా మీకు కొన్ని గూస్‌బంప్స్ ఇస్తా’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. పోస్టర్‌లో మనోజ్ మూడు రకాల హావభావాలు.. హాస్యం, రౌద్రం, శాంతం ప్రదర్శిస్తున్నారు. ‘అహం బ్రహ్మాస్మి’ అనే టైటిల్‌కు అద్దం పట్టే విధంగా ఆ లుక్స్ ఉన్నాయి. ఈ సినిమాను మార్చి 6న గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నారు. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ‘అహం బ్రహ్మాస్మి’ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.

 

Related posts