telugu navyamedia
సినిమా వార్తలు

తారక్ రాజకీయాల్లోకి వస్తే… ఎదురు చూస్తున్నా.. : మంచు మనోజ్

Manchu-manoj

శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించట్లేదని నిన్న ప్రముఖ సీనియర్ నటుడు, శ్రీవిద్యానికేతన్ సంస్థల నిర్వాహకులు మోహన్ బాబు ర్యాలీ చేయడం, ఆయనను పోలీసులు అరెస్ట్ చేయడమనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా మంచు మనోజ్ ప్రజలకు ఓ బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే మంచు మనోజ్ సోషల్ మీడియాలో రాజకీయాలకు సంబంధించి తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్యలకు మనోజ్ స్పందిస్తూ ఎప్పటికి తన మద్ధతు తప్పకుండా జనసేనకు ఉంటుందని చెప్పారు. “ఇప్పుడు ఏ పార్టీకి సపోర్ట్ చేసినా సరే… కానీ 5 సంవత్సరాల తరువాత తారక్ అన్న ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే… ?” అని ఓ నెటిజన్ ప్రశ్నించగా… మనోజ్ సమాధానం చెబుతూ “తారక్ వస్తే ఇంకా నేనెటు వెళ్తా తమ్ముడూ… న మిత్రుడి రాకకోసం ఎదురు చూస్తున్నా… తారక్ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డు వేస్తాను” అంటూ చెప్పడం విశేషం. వీరిద్దరూ మంచి స్నేహితులన్న విషయం అందరికి తెలిసిందే.

Related posts