telugu navyamedia
సినిమా వార్తలు

వాట్ ఎ పవర్ ప్యాక్డ్ టీజర్… “సైరా” : మంచు మనోజ్

Syeraa

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, రవికిషన్, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా టీజర్‌ను చిరంజీవి పుట్టినరోజు (ఆగస్ట్ 22) సందర్భంగా రెండు రోజుల ముందుగానే ఆగస్ట్ 20న విడుదల చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా “సైరా” టీజర్ ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే 10 మిలియన్ల డిజిటల్ వ్యూస్ అధిగమించేసింది.

తాజాగా సైరా టీజర్ పై మంచు ఫ్యామిలీ నుంచి మంచు మనోజ్, మంచు లక్ష్మి స్పందించారు. మనోజ్ ఈ టీజర్ పై స్పందిస్తూ “మిత్రమా రాంచరణ్ నీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ అదుర్స్. వాట్ ఎ పవర్ ప్యాక్డ్ టీజర్. రోమాలు నిక్కబొడుచుకున్నాయి.. మెగాస్టార్ ని బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఎదురుచూడలేకున్నా. చిత్ర యూనిట్ మొత్తానికి నా శుభాకాంక్షలు” అని ట్వీట్ చేశాడు. ఇక మంచు లక్ష్మీ “టీజర్ లో మెగాస్టార్ ఎనర్జీ చూశాక నా మతి పోయింది. చిరంజీవి అంకుల్ ని మెగాస్టార్ అనేది అందుకే. ఇంతటి క్వాలిటీతో చిత్రాన్ని నిర్మించిన రాంచరణ్ కి అభినందనలు” అని మంచు లక్ష్మి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Related posts