telugu navyamedia
సినిమా వార్తలు

మనసుకి ప్రశాంతత


అనుక్షణం ఆలోచనల
అలజడులతో నిండి ఉన్న అంతర్వాహిని….
మనిషి మనసు
ఉరుకుల పరుగుల
జీవన పయనంలో
కావాలి మనిషికీ…మనసుకి
కాస్త స్వాంతన….
ధనముతో దొరికేది కాదు
మానసిక ప్రశాంతత
గడిచిన గతముపై 
చింతను వీడి
భవిషత్తుపై బెంగను మానుకుంటే…..
ఉన్నవాళ్ళతో పోల్చుకొని
అసంతృప్తితో ఉన్నపుడు…
కలుగదు మానసిక ప్రశాంతత
కోరికలను అదుపులో ఉంచి…
ఉన్నంతలో సంతృప్తి చెందినపుడు….
చేసిన తప్పులు ఒప్పుకున్నపుడు…,
మనకు చేసిన దానికి
కృతజ్ఞతలు తెలిపినపుడు…
అన్నిటికి మించి….
అహాన్ని ” తగ్గించుకున్న నాడే
ఉంటుంది…..
మనసుకు ప్రశాంతత….!
-కళావతి కందగట్ల,
హైద్రాబాద్

Related posts