telugu navyamedia
telugu cinema news trending

“ఇదమ్ జగత్” నుంచి ఆకట్టుకుంటున్న “మనసే మనసే…” పాట

Idam-Jagath

సుమంత్ హీరోగా విరాట్ ఫిలిమ్స్ అండ్ శ్రీ విగ్నేష్ కార్తీక్ సినిమాస్ బ్యానర్లపై అనిల్ శ్రీకంఠం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ “ఇదమ్ జగత్”. జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సుమంత్ సరసన అంజు కురియన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో సుమంత్ మొదటిసారిగా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను ముగించుకొని సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు నిర్మాతలు. తాజాగా ఈ చిత్రం నుంచి “మనసే మనసే…” అనే రెండవ పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. శ్రీచరణ్ పాకాల సమకూర్చిన సంగీతం… రమేశ్ అందించిన సాహిత్యం .. యామిని ఘంటసాల అద్భుతంగా పాడిన ఈ పాట అందరినీ కట్టిపడేస్తుంది. కాగా ఈ నెల 28వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts

భారత్ కు .. చైనా హెచ్చరికలు.. వారసుడు తమవాడే కావాలని పట్టు..

vimala p

మృదువైన చర్మం కోసం… ఇవి తాగితే సరి…

vimala p

మనసు ఉంటె-మార్గం ఉంటుంది.. అంటే ఇదేనేమో.. !

vimala p