telugu navyamedia
సినిమా వార్తలు

మన పేమ…

priya bandhavi poetry corner
సఖీ ప్రియా!
మన “పవిత్ర ప్రేమ”
పాలలో కడిగిన ఆణి ముత్యం 
పసిదేవుళ్ళ పెదాల తీగలపై
నాట్యమాడే నగ్నసత్యం
కల్తీలేని ఆరోగ్యకరమైన
స్వఛ్చమైన తల్లిపాలు
క్షీరసాగర మదనంలో 
 ఉద్భవించిన అమృతబాండం
తరువు తనువులోంచి 
 జనయించే ప్రాణవాయువు
ప్రేమదీపానికి ముడి చమురు
అలసిన హృదయాలకు తీపి కబురు
కనువిందు చేసే పచ్చదనపు గుబురు
క్రొవ్వొత్తిలా కరిగివెలిగే 
 త్యాగమయి మన ప్రేమ.
రెండు మనసుల సంగమమే మన ప్రేమ
స్వేచ్చావిహగంగాలలా విహరించునది
చంద్రబింబంలా అందమైనది
పేగు బంధంలా బలమైనది
సుగంధంలా గుబాళించునది
-గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు

Related posts