telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

దేశంలో ఏది చట్టం అయితే అదే ఎక్కువ జరుగుతుందని .. మరోసారి నిరూపణ..

Arrest

ఇటీవలే ట్రిపుల్ తలాక్ పై భారత ప్రభుత్వం ఒక చట్టం చేసింది. సాధారణంగా చట్టం ఏది చేసినా, తద్వారా ఆయా వర్గాలకు మేలు జరగాలని చేస్తారు. కానీ దేశంలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతుంటాయి. మొన్న పోస్కో చట్టం నుండి నిన్న తలాక్ చట్టం వరకు అంతే. చట్టం అయ్యాక ఆయా ఘటనలు జరగకుండా ఉండాలి, కానీ చట్టం చేశాకే ఎక్కువగా ఆయా ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటుండటం మనదేశంలోనే గొప్ప పరిస్థితికి నిదర్శనం. తాజాగా, ముమ్మార్లు తలాక్‌ అంటూ భార్యకు విడాకులు ఇచ్చిన వ్యక్తిని కేరళ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. వివాదా స్పద ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును పార్లమెంటు ఆమో దించిన రెండు వారాల అనంతరం కేరళలో ఈ కేసులో ఇదే మొదటి అరెస్ట్‌ కావడం గమ నార్హం.

కోజికోడ్‌కు చెందిన ఇకె ఉస్సామ్‌ను ముస్లిం మహిళా బిల్లు (వివాహ హక్కుల పరిరక్షణ) -2019 కింద అరెస్ట్‌ చేసి తమర్‌ సెర్రికోర్టు ఎదుట హాజరుపరిచారు. అతని భార్య పిటిషన్‌ వేయడంతో గత వారం ఉస్సామ్‌పై అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసినట్లు ముక్కం పోలీ సులు తెలిపారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు. వివాహం అనంతరం ఉస్సామ్‌ తన భార్యను గల్ఫ్‌ ప్రాంతానికి తీసుకువెళ్లాడని, తరచూ ఆమెను వేధించాడని భార్య తరపు న్యాయవాది అన్వర్‌ సిద్ధిక్‌ తెలిపారు. దీంతో ఆమె భారత్‌కు తిరిగి వచ్చిందని, ఈ నెల ప్రారంభంలో ట్రిపుల్‌ తలాక్‌ అంటూ విడాకులు ఇచ్చి మరో మహిళను వివాహం చేసుకున్నాడని న్యాయవాది పేర్కొన్నారు. ఆ మహిళ బంగా రం అతని వద్దే ఉందని, ఆమెకు చెల్లించాల్సిన భరణాన్ని చెల్లించలేదని తెలిపారు.

Related posts