telugu navyamedia
ట్రెండింగ్

జోకుతో .. ఆగిపోయిన విమానం..

man stopped takeoff about 16hrs with joke

ఎప్పుడైనా వాతావరణం అనుకూలించకనో లేదా.. ఏదైనా సాంకేతిక లోపాలు తలెత్తడం వల్లనో విమానాలు గంటలకు గంటలు ఆలస్యం కావడం మనం వింటూనే ఉంటాం. కానీ బెంగళూరు నుంచి సింగపూర్‌ వెళ్లాల్సిన విమానం మాత్రం ఒక జోక్‌ వల్ల ఆగిపోయింది. అది బయల్దేరి వెళ్లాల్సిన సమయం కంటే దాదాపు 16 గంటలు ఆలస్యమైంది.

అసలువిషయం ఏమంటే, బెంగళూరు నుంచి సింగపూర్‌ బయల్దేరి వెళ్లాల్సిన విమానం టేకాఫ్‌కు సిద్ధమైంది. ఇంతలో ఓ ప్రయాణికుడు తన సీట్‌ నుంచి లేచి వెళ్లి తన బ్యాగులో గన్ ఉందంటూ విమాన సిబ్బందికి చెప్పాడు. దీని తో అప్రమత్తమైన సిబ్బంది అతడిని విమానంలో నుంచి దింపి విమానశ్రయంలో ఉన్న పోలీసులకు అప్పగించారు.

అసలేం జరిగిందో చెప్పమంటూ అతడిని గంటలపాటు పోలీసులు విచారించారు. అతడి లగేజిని క్షుణ్నంగా తనిఖీ చేశారు. అతడి బ్యాగులో అతడి వస్తువులు గిటార్‌ తప్ప ఎటువంటి ఆయుధాలు లేవు. అయితే విమానంలోని ఇతర ప్రయాణికులు కూడా విమానం టేకాఫ్‌ అవ్వడానికి వీల్లేదంటూ డిమాండ్‌ చేశారు. ఈలోపు అతడు చెప్పింది అబద్ధమని భావించి చివరకు టేకాఫ్‌ చేశారు. విమానాశ్రయంలోని పోలీసులు అతడిని విచారించగా తన దగ్గర ఉన్న గిటార్‌ను గన్‌గా చెప్పి జోక్‌ చేశానని ఆ వ్యక్తి చెప్పడం కొసమెరుపు.

Related posts