telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

అర్ధరాత్రి అంబులెన్సు తీసుకెళ్లి ఆ వ్యక్తి చేసిన పనేంటో తెలిస్తే షాక్…!?

SIT Investigation YS viveka Murder

గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత హూస్టన్‌లోని సైప్రెస్ క్రీక్ మానసిక వైద్య కేంద్రం నుంచి అర్ధరాత్రి వేళ 60 ఏళ్ల వ్యక్తి అంబులెన్స్ తీసుకొని ఉడాయించాడు. సదరు వ్యక్తి ఆ ఆసుపత్రిలోనే ఇంతకుముందు చికిత్స కూడా పొందాడు. ఇక ఆసుపత్రి బయటవైపు ఇంజిన్ ఆన్‌లోనే ఉన్న అంబులెన్స్‌ను చూసిన అతగాడు.. ఎంచక్కా అదేదో తన సొంత వాహనం అయినట్లు వేసుకొని ఫాస్ట్‌ఫూడ్ సెంటర్‌కు వెళ్లి పోయాడు. కొద్దిసేపటి తరువాత అంబులెన్స్ కనిపించకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో దగ్గరలోని గ్యాస్ స్టేషన్ వద్ద వాహనాన్ని గుర్తించారు. అంబులెన్స్ కనిపించడంతో వెళ్లి చూసిన పోలీసు లోపల కూర్చున వ్యక్తి.. అతడు చేస్తున్న పని చూసి నిర్ఘాంతపోయారు. ఒక చేతిలో సిగరెట్, మరో చేతిలో ఫ్రైడ్ చికెన్ పట్టుకొని లాగిస్తున్నాడు మనోడు. ఎందుకు అంబులెన్స్ దొంగలించావు అని అడిగితే… ఫ్రైడ్ చికెన్, సిగరెట్‌ల కోసం రైడ్‌కు వెళ్లానని చెప్పాడు. దాంతో అతడిపై దొంగతనం కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు. ఇంతకుముందుకు కూడా సదరు వ్యక్తి పలుమార్లు ఇలాగే ఆసుపత్రిలోని వాహనాలను తీసుకొని బయటకు వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Related posts