telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

అపర కుబేరుడికి అవమానం… ఏం జరిగిందంటే…!?

Baidu

చైనా ఇంటర్నెట్ దిగ్గజం రాబిన్‌లీకి బుధవారం నాడు ఏకంగా వేదికపైనే చేదు అనుభవం ఎదురైంది. రాబిన్‌లీ చైనా సెర్చ్ ఇంజిన్‌ కంపెనీ బైడుకు చైర్మన్, సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. ప్రపంచ ధనవంతుల్లో ఆయన కూడా ఒకరు. ఫోర్బ్స్ ప్రకారం ఆయన నెట్ వోర్త్ 18 బిలియన్ల డాలర్లకు పైగానే. ఇంత పెద్ద నెట్‌వర్క్ కలిగిన వారు పబ్లిక్ మీటింగ్‌లలో ప్రసంగించే సమయంలో సహజంగా సెక్యూరిటీ ఎక్కువగానే ఉంటుంది. బైడు కంపెనీకి సీఈఓగా వ్యవహరిస్తున్న ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)పై కంపెనీ స్పాన్సర్డ్ ఈవెంట్‌లో ప్రసంగిస్తుండగా.. ఓ వ్యక్తి ఒక్కసారిగా వాటర్ బాటిల్‌తో స్టేజిపైకి వచ్చి బాటిల్‌లోని నీళ్లను రాబిన్‌లీపై గుమ్మరించాడు. దీంతో రాబిన్‌లీకి కొద్ది సెకన్ల పాటు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. నీళ్లు పోసి వెళ్లిపోతున్న వ్యక్తిని ‘నీ సమస్య ఏంటి?’ అని రాబిన్‌లీ ప్రశ్నించినప్పటికీ ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఆ సమయంలో రాబిన్‌లీ ఏ మాత్రం కూడా వేరే విధంగా ప్రవర్తించకుండా.. చాకచక్యంగా తన ప్రసంగాన్ని కొనసాగించడంతో ఈవెంట్‌కు హాజరైన వారందరూ చప్పట్లతో రాబిన్‌లీని ప్రశంసించారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఆ వ్యక్తి ఇలా ఎందుకు చేశాడన్నది తెలియాల్సి ఉంది.

Related posts