telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

మరుగుదొడ్డి కోసం.. అధికారుల ధర్నా..

man objection to have toilet at home

స్వచ్ఛ భారత్ లో భాగంగా అందరికి మరుగుదొడ్డి నిర్మించి ఇస్తున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే దీనిని ప్రతిఘటించిన ఒక కుటుంబం పై నల్గొండ జిల్లా అధికారులు, ఆ గ్రామ సర్పంచ్‌ నిరసన తెలిపారు. ఈ ఘటన తిరుమలగిరిలో జరిగింది. స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమం ద్వారా సులువుగా, అతి తక్కువ ధరలోనే మరుగుదొడ్డి నిర్మించుకోవచ్చని అధికారులు గ్రామంలో పలుమార్లు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. ఎంతో మంది ముందుకు వచ్చి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వ సాయం తీసుకున్నారు కూడా.

గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం ఎంతవరకూ వచ్చిందో పరిశీలించేందుకు జిల్లా అధికారులు తిరుమలగిరికి వచ్చారు. ఓ వ్యక్తి ఎంత చెప్పినా మరుగుదొడ్డిని కట్టుకునేందుకు అంగీకరించడం లేదని స్థానిక అధికారులు తెలపడంతో, ఆయన ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. లెట్రిన్ కట్టించుకోవాలని, తద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని, బహిరంగ మల విసర్జనతో రోగాలు వ్యాపిస్తాయని ఇంటి యజమానికి నచ్చజెప్పారు.

Related posts