telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్

గుడిసెకు ఒక .. ఏసీ .. ఈ పధకం ఏదో బాగుందే..!

man installed airconditioner in hut

ఏసీ పెట్టించుకున్నారు అంటే.. కాస్తో, కూస్తో శ్రీమంతుల కుటుంబమే అనుకోవాలి. పల్లెటూర్లలో అయితే ఏసీ అనేది ఖచ్చితంగా లగ్జరీగా భావించే వ్యవహారమే. మాములుగా అయితే ఖరీదైన బంగళాలు, డాబాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. కానీ పూరింట్లో మీరు ఎప్పుడైనా ఏసీ చూశారా? అయితే ఇప్పుడు చూడవచ్చు. ఇది ఎక్కడో జరిగింది కాదు.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఒంగోలులోని బాలాజీ నగర్‌లో జరిగింది. కొన్నేళ్లుగా అక్కడే నివసిస్తున్న ఓ వృద్ధురాలు అనారోగ్యంతో మంచాన పడింది. దీనితో ఆమె నివశిస్తున్న గుడిసెకు హైటెక్ హంగులు అద్దాడు వృద్ధురాలి అల్లుడు. మొదట కూలర్‌ని ఏర్పాటు చేశాడు.

ఒకవేళ ఎండ వేడి పెరిగితే ఆవిడ ఇబ్బంది పడుతుందేమో..అని, ఏసీ కూడా పెట్టించాడు. దీనితో.. అత్త ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రస్తుత కాలంలో తల్లీదండ్రులనే పట్టించుకోని వారున్న లోకంలో.. అత్తకి బాగాలేదని ఆమె కోసం సకల సౌకర్యాలు కల్పించి.. గుడిసెకు ఏసీ ఏర్పాటు చేయడాన్ని చూసి కాలనీవాసులు సదరు అల్లుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Related posts