telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కొత్త వాహన చట్టంతో .. బెంబేలెత్తుతున్న వాహనదారులు.. 47వేల జరిమానాతో ఆటోవాలా అవాక్కు..

man got penalty of 47500 for no papers

కొత్త వాహన చట్టం వాహనదారులకు బెంబేలెత్తిస్తోంది. రోడ్డుపైకి సరైన పత్రాలు లేకుండా వస్తే ఇక అంతే.. జరిమానా వేలల్లోనే. తాజాగా, సరైన పత్రాలు లేని కారణంతో ఓ వాహనదారుడికి ఏకంగా రూ.23వేలు చలానా రాసిన ఘటన మరిచిపోకముందే ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లో మరో ఘటన వెలుగుచూసింది. ఓ ఆటోవాలకు ఏకంగా రూ.47,500 వేల ఫైన్ విధించారు అక్కడి ట్రాఫిక్ పోలీసులు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మోటార్ వాహన సవరణ చట్టం 2019 ప్రకారం చలాన్‌లు కాకపుట్టిస్తున్నాయి. నిబంధనలు పాటించని వాహనదారుల వీపు విమానం మోత మోగించే పనిలో పడ్డారు ట్రాఫిక్ పోలీసులు. ఒడిషాలోని భువనేశ్వర్‌లో సరైన పత్రాలు లేకపోవడం, తాగి వాహనం నడపడం, పైగా లైసెన్స్ లేకపోవడం వంటి అతిక్రమణలకు భారీ మూల్యాన్ని చెల్లించాలని షాక్ తినిపించారు. 

వాహనాల తనిఖీల్లో భాగంగా ఆటో డ్రైవర్ హరిబంధు కన్హార్‌ అనే వ్యక్తి నడిపిస్తున్న ఆటోను ఆపారు. దీంతో అతడి వద్ద సరైన పత్రాలు లేకపోవడంతోపాటు మద్యం సేవించి వాహనాన్ని నడపడంతో ఇంతపెద్ద మొత్తాన్ని జరిమానాగా విధించారు. అయితే తాను రూ.47,500 వేలు కట్టలేనని, కావాలంటే వాహనాన్ని సీజ్ చేయాలని, అవసరమైతే జైలుకైనా పంపించాలని ట్రాఫిక్ పోలీసులకు చెప్పాడు. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకుని వాహనాన్ని సీజ్ చేశారు. కొత్త వాహన రవాణ సవరణ చట్టం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ఇంకా తెలుగు రాష్ట్రాల్లో అమలు కావడం లేదు. ఒకవేళ అమలైతే ఎన్ని కేసులు సమోదవుతాయో.. ఎంతెంత చలాన్లు రాస్తారో అనే ఆసక్తి నెలకొంది.

Related posts